Flora Saini BiggBossTelugu9.. ప్రతి మనిషి జీవితంలోనూ.. ప్రపంచానికి తెలియని ఎన్నో ‘లోతులు’ వుంటాయి.! చీకట్లుంటాయి. సినీ ప్రపంచంలోనూ అంతే.!
వెండితెరపై మెరిసిపోయే తారల జీవితాల్లోని అగాధాల గురించి, ఎక్కడన్నా వాళ్ళు చెబితేనే తప్ప.. అవి బయటకు వచ్చే అవకాశం వుండదు.
తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో ‘లక్స్ పాప’గా చెరగని ముద్ర వేసింది ఆశా సైనీ అలియాస్ ఫ్లోరా సైనీ. చాలా ఏళ్ళ తర్వాత, ఫ్లోరా సైనీ, తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది.
Flora Saini BiggBossTelugu9.. నరకం అనుభవించా..
‘నా జీవితంలో ప్రేమకు చోటు లేకుండా పోయింది.. ఆ ప్రేమ ఓ పీడ కలలా మారిపోయింది.. చాలా టార్చర్ అనుభవించా..’ అంటూ తాజాగా ఆశా సైనీ చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో తొమ్మిదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది ఆశా సైనీ అలియాస్ ఫ్లోరా సైనీ. తనను ఆశా అని పిలవొద్దంటూ నాగార్జునతోనే చెప్పింది.
తన పేరు ఫ్లోరా సైనీ అనీ, తెలుగు సినిమా కోసం ఆశా పేరుని పెట్టుకోవాల్సి వచ్చిందని ఫ్లోరా వివరించింది. సరే, పేరులో ఏముంది.? అని అంటారా.? అదంతే.
బిగ్ బాస్‌ని తట్టుకోగలదా.?
సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదుగానీ, పలు వెబ్ సిరీస్‌లలో ఫ్లోరా సైనీ నటిస్తూనే వుంది. వాటిల్లో కొన్ని అడల్ట్ కంటెట్‌తో తెరకెక్కినవీ వున్నాయి.
వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో కూడా ఫ్లోరా సైనీ నటించడం గమనార్హం.

ఫ్లోరా సైనీ తెలుగమ్మాయ్ కాదు. కానీ, తెలుగులో గలగలా మాట్లాడేస్తోంది. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో.. ఇలాంటి కంటెస్టెంట్లను, జస్ట్ గ్యాప్ ఫిల్లింగ్ కోసం.. అన్నట్లు తీసుకుంటుంటారు.
ఫ్లోరా సైనీ మాత్రం, టైటిల్ విన్నర్ అయి తీరతానంటూ.. వేదికపైనే, అది కూడా హోస్ట్ అక్కినేని నాగార్జున సమక్షంలోనే శపథం చేసేసింది.
మొదటి వారం లేదా రెండో వారం.. మేగ్జిమమ్ ఎలిమినేట్ చేసేస్తుంటారు.. ఇలాంటి వాళ్ళని. మరి, ఫ్లోరా సైనీ కూడా అదే బాపతా.? వేచి చూడాల్సిందే.