Pawan Kalyan Game Changer.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఈ మధ్య పదే పదే తనను కొందరు టార్గెట్ చేస్తున్నారంటూ వాపోతున్న విషయం విదితమే.
ఎవరైనా ఎందుకు టార్గెట్ చేస్తారు.? అయినా, దిల్ రాజుని టార్గెట్ చేస్తే ఎవరికి లాభం.? దిల్ రాజు ప్రముఖ నిర్మాత.. కాదనలేం.! కానీ, అంతకన్నా గొప్ప నిర్మాతలున్నారు కదా.!
దిల్ రాజుకి మాత్రమే ఎందుకింత పాపులారిటీ.? అంటే, తీసే సినిమాల కంటే, వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అవుతాడనేమో.. అన్నది కొందరి వాదన.
పవన్ కళ్యాణ్‌తో సినిమా తన డ్రీమ్.. అని గతంలో దిల్ రాజు చెప్పాడు. సినిమా తీశాడు కూడా.! కానీ, ఏపీలో రాజకీయ రచ్చ నేపథ్యంలో దిల్ రాజు అక్కడో మాట, ఇక్కడో మాట చెప్పి.. అందరికీ టార్గెట్ అయిపోయాడు.
దిల్ రాజు నాలిక మడత..
మొన్నటికి మొన్న సంక్రాంతి సినిమాల విషయంలో దిల్ రాజు నాలిక మడతేసిన వైనం అందరికీ తెలిసిందే. ఇలాంటివి చాలానే వుంటాయ్.
ఇప్పుడిక ‘గేమ్ ఛేంజర్’ వంతు.! ఈ సినిమాని పవన్ కళ్యాణ్‌తో చేయాలని దర్శకుడు శంకర్ అనుకుంటే, ‘కాదు కాదు, రామ్ చరణ్ అయితే బావుంటుంది’ అని దిల్ రాజు ‘డైవర్ట్’ చేశాడట.
పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానంటూ తమిళ దర్శకుడు శంకర్ కథ తీసుకొస్తే..!
వద్దు.. పవన్ కళ్యాణ్‌తో కాదు.. రామ్ చరణ్ అయితే బావుంటాడని దిల్ రాజు అన్నాడట.!
దిల్ రాజే స్వయంగా చెప్పాడు తాను చేసిన ఘనకార్యాన్ని.!
ఫలితం అనుభవిస్తున్నాడు.. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు..
అంతా కలిసి ఏకి పారేస్తున్నారు దిల్ రాజుని.!
Mudra369
ఇంకెవరో ఈ మాట చెబితే, అది వేరే సంగతి. సాక్షాత్తూ దిల్ రాజే చెప్పుకున్నాడు ఆ మాటని. అంతే, పవన్ కళ్యాణ్ అభిమానులకి మండింది.
ఈ తరహా పబ్లిసిటీ స్టంట్లు చేయడం దిల్ రాజుకి కొత్తేమీ కాదు. పవన్ కళ్యాణ్ అభిమానుల్ని దిల్ రాజు ఎందుకు కెలికాడట.?
Game Changer Pawan Kalyan.. ఎందుకు కెలికావ్ రాజూ.?
పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కెలకడం మాత్రమే కాదు, పవన్ – రామ్ చరణ్ అభిమానులు కొట్టుకునేలా దిల్ రాజు వ్యాఖ్యలున్నాయన్నది ఓ వాదన.
Also Read: Ustaad Bhagat Singh.. ఊచకోత షురూ.!
ఈ నేపథ్యంలో అటు పవన్ అభిమానులు, ఇటు రామ్ చరణ్ అభిమానులూ దిల్ రాజుని గట్టిగానే ఏసుకుంటున్నారు. అదే దిల్ రాజుకి కావాల్సింది కూడా.!