Gandeevadhari Arjuna మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కంటెంటూ.. కటౌటూ వున్నోడు.! నటుడిగా తానేంటో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న ఈ మెగా హీరో, త్వరలో ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమా టైటిల్‌తో పాటూ, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే చించేశాడు వరుణ్ తేజ్. పక్కా స్టైలిష్ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా వుండబోతోందని పోస్టర్ చూస్తుంటే అర్ధమవుతోంది.
Gandeevadhari Arjuna ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్..
మోషన్ పోస్టర్‌లో ఓ ప్యాలెస్.. మాస్క్ వేసుకున్న కొందరు గ్యాంగ్.. వారిని అడ్డుకుంటున్న వరుణ్ తేజ్.. కనిపిస్తున్నాడు. అలాగే, బాంబ్ బ్లాస్ట్‌లు, కార్ ఛేజింగ్‌లూ, తుపాకీ కాల్పులూ.. ఇలా విధ్వంసం కనిపిస్తోంది.
ఈ యాక్షన్ గ్లింప్స్‌లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా స్టైలిష్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ గ్లింప్స్‌కి మిక్కీ జె మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్‌ట్ లెవల్.
Also Read: Ketika Sharma: నల్లా నల్లాని సోకు.! అట్టాగ సూడమాకే.!
వరుణ్ తేజ్ బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్‌కి మెగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్టోబర్‌లో మొదలైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అన్నట్లు ఈ సినిమాకి ‘గాంఢీవధార అర్జున’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ కాస్త కష్టంగా తోస్తున్నప్పటికీ, కంటెంట్‌కి సంబంధించి ఈ టైటిల్ యాప్ట్ అని తెలుస్తోంది.