Table of Contents
Gangadhareshwara Temple Shivagange.. వెన్నను కరిగిస్తే నెయ్యి వస్తుంది.. ఇది అందరికీ తెలిసిందే.
అయితే, ఇక్కడి శివాలయంలో శివునికి నేతితో అభిషేకం చేస్తే అది వెన్నలా మారుతుంది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా.?
అయితే మీకు ఈ శివాలయం గురించి తెలియాల్సిందే. ఈ అద్భుతమైన మహిమ గల ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా.? కర్ణాటకలోని దొబ్బాస్ పేటలో వుంది.
సైన్స్‌కే సవాల్ విసిరే ఎన్నో అద్భుతాలు ఈ శివాలయంలో దాగి వున్నాయ్. కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడి మర్మాల్ని తెలుసుకునే దిశగా రీసెర్చులు జరుగుతున్నాయ్.
Gangadhareshwara Temple Shivagange.. సైన్స్‌కే అందని గుట్టు..
ఎన్ని రీసెర్చులు జరుగుతున్నా, ఈ శివాలయంలో జరిగే ఈ అద్భుతాలకి కారణాలను మాత్రం ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.

సముద్ర మట్టానికి దాదాపు 4,559 అడుగుల ఎత్తులో కర్ణటకలోని దొబ్బాస్‌పేటలో ఈ శివగంగ పుణ్యక్షేత్రం కొలువై వుంది.
ఇక్కడి కొండ శివుని లింగాకారాన్ని పోలి వుండడం, ఆ కొండ పైనుంచి ‘గంగ’ అనే ఓ నీటి ధార ప్రవహించడం కారణంగా ఈ పుణ్య క్షేత్రానికి శివగంగ పుణ్య క్షేత్రం అని పేరొచ్చింది.
ఈ కొండ గుహలోనే గంగాధరేశ్వరుడి (Gangadhareshwara Temple) గా పిలవబడే పరమేశ్వరుడు, హొన్నమ్మదేవి (పార్వతీ దేవి)తో కలిసి కొలువు దీరాడు.
నెయ్యి నుంచి వెన్న రావడం..
ఇక్కడి శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయగా, అనంతరం అది తెల్లని నురగలాంటి చిక్కని ద్రవం (వెన్న) గా మారుతుంది.
ఈ వెన్నలో అనేక ఔషధ గుణాలున్నట్లు అక్కడి స్ణానికులు, పండితులు చెబుతుంటారు. శివలింగంపై అభిషేకం అనంతరం నెయ్యి, వెన్నలా ఎలా మారుతుంది.? అనేది మాత్రం ఇంతవరకూ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.

స్వయంగా భక్తులు ఈ చిత్రాన్ని చూసి పులకించిపోతుంటారు. ప్రతీ ఏడాది జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండగ నాడు ఇక్కడి పార్వతీ పరమేశ్వరులకు ఘనంగా కళ్యాణం జరిపిస్తారు.
ఇక్కడి కొండపై నుంచి జాలువారే నీటి ధారనే ‘శివగంగ’ (Gangadhareshwara Temple) అని పిలుస్తుంటారు. ఈ ధార ఎక్కడి నుంచి వస్తుందో కూడా అంతుపట్టలేదింతవరకూ.
ఈ నీటినే శివ పార్వతుల కళ్యాణ కార్యక్రమాలకు ఉపయోగించడం విశేషం.
నంది కొమ్ముల మధ్యగా ప్రసరించే సూర్య కాంతి..
ఈ క్షేత్రంలో మరో విశేషం ఇక్కడి బసవన్న. నిటారుగా నిలబడి వున్న శిలపై బసవన్న (నంది) భారీ రూపం నిండుగా దర్శనమిస్తుంది.
నిటారుగా వున్న ఈ శిలపైకి అతి కష్టంపై ఎక్కి భక్తులు నందిని దర్శించుకుంటారు.

సంక్రాంతి సమయంలో సూర్య కిరణాలు ఈ నంది కొమ్ముల మధ్య నుంచి ప్రసరించి గర్భాలయంలో వున్న గంగాధరేశ్వరునిపై (Gangadhareshwara Temple) పడడం ఇక్కడి మరో అద్భుతం.
ఈ టెక్నాలజీ నాటి వాస్తు నిపుణుల ప్రజ్ఞకు తార్కాణం అనే చెప్పాలి. ఇక గంగాధరేశ్వరుడ్ని దర్శించుకోవడం కూడా అంత సులభమైన మార్గమేమీ కాదు.
Gangadhareshwara Temple Shivagange.. గుహలో కొలువైన గంగాధరేశ్వరుడు
సన్నని దారి గుండా పోయే గుహాలయంలో పరమేశ్వరుడు కొలువుదీరి వుంటాడు. ఈ సన్నని దారి గుండా (వంగి) పయనించి గంగాధరేశ్వరున్ని దర్శించడం నిజంగా అదొక అధ్భుతమైన అనుభూతి.
Also Read: వైరల్ వీడియో.! జింకలు పాముల్ని తింటాయా.?
ఆ సరికొత్త అనుభూతిని ఫీల్ అవ్వాలంటే, ఖచ్చితంగా ఒక్కసారైనా గంగాధరేశ్వర మందిరాన్ని దర్శించాల్సిందే. ఇక్కడి అద్భుతాల్ని స్వయంగా అనుభూతి చెందాల్సిందే.