Gig Workers Problems.. ‘గిగ్ వర్కర్స్’ ఆందోళనబాట పట్టారు. దేశవ్యాప్తంగా, కీలక సమయంలో ‘ఆన్లైన్ పుడ్ డెలివరీ’ సేవలకు అంతరాయం కలిగింది.!
అసలు ఈ ‘గిగ్ వర్కర్స్’ అంటే ఏంటి.? వీళ్ళ కష్టాలేంటి.? వీళ్ళసలు మనుషులేనా.? లేదంటే, బానిసత్వం చేసే పెంపుడు జంతువులా.?
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి, ‘ఆన్లైన్ ఫుడ్ డెలివరీ’ చిన్నపాటి పరిష్కార మార్గం చూపిస్తోంది. కేవలం ఫుడ్ డెలివరీ మాత్రమే కాదు, గ్రాసరీస్ సహా.. చాలా వున్నాయ్.
ఫోన్ చేస్తే, ఐదు నిమిషాల్లోనే ఇంటి గుమ్మం దగ్గర వుంటున్నారు గిగ్ వర్కర్స్, రకరకాల ప్రోడక్ట్స్‌తో.! పెన్సిల్ దగ్గర్నుంచి, పెసరట్టు దాకా.. ఏదైనాసరే, అలా వచ్చేస్తోందతే.
కూరగాయలు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్.. వాట్ నాట్.. అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని, ఇంటికి తెప్పించేసుకోవడమే.! బయటకు వెళ్ళి తెచ్చుకుంటే, ట్రాఫిక్ సహా.. అనేక సమస్యలున్నాయ్ మరి.!
ఈరోజు ఆర్డర్ చేస్తే, వారం రోజుల తర్వాత వచ్చే పాత కాలం కాదిది.! క్షణాల్లో గుమ్మం ముందు వాలిపోతున్నాయ్.! ఆన్లైన్ విక్రయాలకు సంబంధించి.. ఆయా ప్లాట్‌ఫామ్స్ మధ్య పోటీ అలా వుంది.
ఇంత వేగంగా డెలివరీ చేసే క్రమంలో, ‘గిగ్ వర్కర్స్’ కష్టాలేంటి.? ప్రధానంగా, ఒత్తిడి.. ఆపై ప్రమాదాలు.. ఇదీ, డెలివరీ బాయ్స్ కష్టాలు.!
వేగంగా, డెలివరీ చేసే క్రమంలో రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. వాళ్ళు ప్రమాదాల బారిన పడ్డమే కాదు, ఇతరులు ప్రమాదాల బారిన పడటానికీ కారణమవుతున్నారు.
ఇక్కడ ప్రత్యేకించి సెలవులేమీ వుండవు గిగ్ వర్కర్లకి. ఎక్కువ సంపాదించుకోవాలంటే, ఎక్కువ సమయం పని చేయాల్సిందే. ఇక్కడా మళ్ళీ పోటీనే.. వాళ్ళలో వాళ్ళకే ఒకరితో ఒకరికి పోటీ.
నిజానికి, గిగ్ వర్కర్స్ అంటే.. వాళ్ళూ మనుషులే. మన కుటుంబాల్లోనే, యువత ‘గిగ్ వర్కర్లు’గా మారుతున్నారు.! కానీ, అలాంటివారి పట్ల, కనీసపాటి మానవత్వం ప్రదర్శిస్తున్నామా.?
హై రైజ్ అపార్ట్‌మెంట్స్‌లో.. లిఫ్ట్ వున్నా, గిగ్ వర్కర్స్ వాటిని వినియోగించడానికి వీల్లేకుండా పోతోంది కొందరు శాడిస్ట్ వినియోగదారుల వల్ల.!
చెప్పుకుంటూ పోతే, చాలా కష్టాలే వున్నాయి. సినిమాల్లోనూ, వెబ్ సిరీస్‌లలోనూ గిగ్ వర్కర్స్ కష్టాల గురించి చూస్తున్నాం. నాణేనికి ఓ వైపు మాత్రమే ఇది.
ఇంకో వైపు, గిగ్ వర్కర్లు అక్రమాలకు పాల్పడటం, జుగుప్సాకరమైన పనులు చేయడం కూడా చూస్తూనే వున్నాం.! అది మళ్ళీ వేరే చర్చ.!
