Table of Contents
Ground Report YSRCP Thumbs Down.. 2024 ఎన్నికల్లో దారుణ పరాజయానికి గురైనా, 40 శాతం ఓటు బ్యాంకు తమకు వుందంటూ పదే పదే చెప్పుకుంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.!
వై నాట్ 175 అని వైసీపీ నినదిస్తే, వైసీపీకి వచ్చింది 11 సీట్లు.! 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీ పడిపోవడమంటే, అది అత్యంత ఘోర పరాజయం.
చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతటి దారుణ పరాజయాన్ని చవిచూడలేదేమో.. అని రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు.
ఎంతటి ప్రజా వ్యతిరేకత వుంటే, ఇంత గోర పరాజయాన్ని వైసీపీ చవిచూస్తుంది.? కానీ, వైసీపీ, తమ ఓటమికి ‘పోస్టు మార్టమ్’ చేసుకోవడానికి ఇష్టపడలేదు.
Ground Report YSRCP Thumbs Down.. ఈవీఎం లొల్లి.. ఇంకానా.?
164 సీట్లతో కూటమి అధికార పీఠమెక్కితే, అది ‘ఈవీఎం గెలుపు’ అంటూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది, ఆరోపిస్తూనే వుంది.!
ప్రజా స్వామ్యంలో గెలుపోటముల్ని డిసైడ్ చేసేది నెంబర్ గేమ్ మాత్రమే.! ఓటమిని అంగీకరించాలి, గెలుపు కోసం బాటలు వేసుకోవాలి.! అదే రాజకీయమంటే.
కానీ, వైసీపీ ఇంతవరకు ఆత్మ విమర్శ చేసుకోలేదు. వైసీపీ ఓడిపోయాక, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ బెంగళూరుకే పరిమితమైపోయారు.
వారానికోసారి బెంగళూరు నుంచి విజయవాడకు రావడం, వెంటనే తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోవడం.. ఇదంతా ఓ ప్రసహనంగా మారిపోయింది.
వైఎస్ జగన్, విజయవాడకు వచ్చినప్పుడు వైసీపీ శ్రేణుల్లో హంగామా, వైఎస్ జగన్ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే, దాని మీద బజనలు.. ఇదీ గడచిన ఏడాదిన్నర కాలంగాలో వైసీపీలో నడుస్తున్న ప్రసహనం.
పుంజుకునేదెలా.?
ఏ ప్రభుత్వం ఎంత గొప్పగా పరిపాలించినా, ప్రజా సమస్యలు ఎప్పుడూ వుంటూనే వుంటాయి. వాటి మీద పోరాటం చేస్తేనే, ఏ రాజకీయ పార్టీ అయినా, తన ఉనికిని చాటుకోగలుగుతుంది.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా.. అంటూ, వైఎస్ జగన్ ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకే షరతులు పెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం.
నిజానికి, ఈ బెదిరింపు అధికార పక్షానికి కాదు.. ప్రజల్ని వైఎస్ జగన్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న చర్చ ఆ ప్రజల్లోనే జరుగుతోంది.
త్వరలో వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేపడతారట. ఈలోగా పార్టీ మరింత పతనమైయే పరిస్థితి దాపురించిందన్న వాస్తవాన్ని వైఎస్ జగన్ ఎప్పుడు గుర్తెరుగుతారో ఏమో.!
రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేదు. ఆ స్థానాన్ని తొలుత వైసీపీ భర్తీ చేయాల్సి వుంటుంది. అడుక్కుంటే ప్రతిపక్ష హోదా రాదు.. ప్రజలతో మమేకమైతే, ప్రజలే ఆ గుర్తింపునిస్తారు.
వైఎస్ జగన్, ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో ఏమో.! అసెంబ్లీకి వెళ్ళకుండా, బెంగళూరుకి పరిమితమైపోయి, పాదయాత్ర చేస్తా.. అధికారంలోకి వస్తా.. అంటే, ప్రజలు విశ్వసించే పరిస్థితే వుండదు.
రాష్ట్రంలో వైసీపీ ముఖ్య నేతలెవరూ, గ్రౌండ్‌లో ప్రజలతో మమేకమవడం లేదు. పులివెందుల ఎమ్మెల్యే హోదాలో వైఎస్ జగన్ కూాడా, తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వుండటం లేదు.
వైసీపీకి ఇకపై శాశ్వత నిద్రే..
ఇవన్నీ చూస్తోంటే, వైఎస్ జగన్ ఓటమి తర్వాత, బలం పుంజుకునే ప్రయత్నాలు అస్సలు చేయడం లేదనే అనిపిస్తోంది.!
మొన్నటికి మొన్న తెలంగాణలో బల ప్రదర్శన చేసి, అదీ అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం కోర్టులో హాజరయ్యే క్రమంలో చేసిన జన సమీకరణ, తప్పుడు సంకేతాల్ని పంపింది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లోకి.
సమయం మించిపోలేదు.. వైఎస్ జగన్, ఆత్మ విమర్శ చేసుకోవాలి. పార్టీని గాడిన పెట్టాలి. ఇవన్నీ జరగాలంటే, వైఎస్ జగన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వుండాలి.
పార్టీని గాలికొదిలేసి వైఎస్ జగన్, పొరుగు రాష్ట్రాల్లో సేద తీరుతుంటే, వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఉత్తేజం ఎక్కడి నుంచి వస్తుంది.?
కళ్ళు మూసుకుంటే, ఏళ్ళు గడిచిపోతాయని వైఎస్ జగన్ పదే పదే చెబుతుంటారు. రానున్న మూడేళ్ళు కూడా కళ్ళు మూసుకుంటే, వైసీపీకి శాశ్వత నిద్రే ఇక.!
