GST Car Price Down.. కార్ల కంపెనీలు పోటీ పడుతున్నాయి. టాటా సహా పలు కార్ల కంపెనీలు, జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాల్ని ప్రకటించేశాయి.!
కేంద్ర ప్రభుత్వం, ఇటీవల జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు చేయడంతోపాటుగా, కొన్ని రకాల కార్లపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
నిజానికి, మారిన జీఎస్టీ శ్లాబులు, తగ్గింపు జీఎస్టీ నేపథ్యంలో చాలా ధరలు తగ్గాల్సి వుంది. అయితే, కార్ల కంపెనీల నుంచే ముందుగా ఈ ‘తగ్గింపు’ పండగ షురూ అయ్యింది.
తగ్గింపులు కూడా 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ వుంటున్నాయి. దాంతో, కార్లు కొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. కొందరేమో, సెప్టెంబర్ తర్వాత ఇంకెంత తగ్గుతాయో.. అని ఎదురుచూస్తున్నారు.
GST Car Price Down.. కంపెనీల మ్యాజిక్కు ఏంటో.!
సాధారణంగా విజయ దశమి ముందర, కార్ల కంపెనీలు తగ్గింపు ధరల్ని ప్రకటిస్తుంటాయి. విజయ దశమి నేపథ్యంలో వాహనాల కొనుగోళ్ళకు జనం ఆసక్తి చూపడమే అందుక్కారణం.
ఆకర్షణీయ తగ్గింపు ధరల వెనుక చాలా మ్యాజిక్కులుంటాయ్. కంపెనీలు చెప్పే ధరలకీ, రోడ్డు మీదకు కారు వచ్చేటప్పటికి అయ్యే ఖర్చుకీ.. అస్సలు పొంతనే వుండదు.
ఇలా, ఈ పండగ తగ్గింపులతో పోల్చితే, జీఎస్టీ తగ్గింపు కారణంగా కార్ల కంపెనీలు ప్రస్తుతం చూపిస్తున్న తగింపులు పెద్ద ఎక్కువేమీ కాదన్న వాదనా లేకపోలేదు.
తగ్గాల్సినవి చాలా వున్నాయ్..
పెట్రో ధరలు తగ్గితే, కార్ల ధరల తగ్గింపుకి కాస్తో కూస్తో ప్రయోజనం వుంటుందన్నది సగటు వాహనదారుడి అభిప్రాయం. కానీ, జీఎస్టీలో ఎక్కడా పెట్రో ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
కార్లు మాత్రమే కాదు, టూ వీలర్లు అలాను త్రీ వీలర్ల ధరలు కూడా తగ్గుతున్నాయి జీఎస్టీ కారణంగా.
ఎంత సేపూ వాహనాలకు సంబంధించిన తగ్గింపు చర్చ తప్ప, ఇతరత్రా తగ్గింపుల గురించిన మాటే వినిపించడంలేదు.
తగ్గాల్సినవి నిత్యావసర వస్తువుల ధరలు. ఇన్స్యూరెన్స్ ధరలు కూడా తగ్గాల్సి వుంది. మరి, వీటి తగ్గింపులపై ఏమన్నా వార్తలు వింటున్నామా.? ప్చ్.. లేదాయె.!
సెప్టెంబర్ 22 తర్వాత తెలుస్తుంది.. అసలు ఈ జీఎస్టీ తగ్గింపు బుడగ వెనుక వాస్తవమేంటో.!