హాట్ సమ్మర్‌లో కూల్ కూల్‌గా స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న ఈ ముద్దుగుమ్మని (Neha Sharma) గుర్తు పట్టారా.? మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్‌గా పరిచమైంది.
బోనీ మెగా రేంజ్‌లో వున్నా.. పాప కెరీర్ అంతంత మాత్రంగానే వుంది. ఎవరో ఈ పాటికి అర్ధమైపోయే వుండాలి. అవునండీ ఆమె ఎవరో కాదు.. ‘చిరుత’ భామ నేహా శర్మ.
‘చిరుత’ సినిమాతో పూరీ కంపెనీ నుంచి గ్రాండ్‌గా లాంఛ్ అయిన ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో సరైన ఆదరణ దక్కలేదు పాపం. ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ తన అందాలతో హాట్ హాట్‌గా వలలు విసురుతూనే వుంది.
ఐటెమ్ గాళ్‌గా అయినా..
కనీసం స్పెషల్ సాంగ్స్ అయినా.. అంటూ టాలీవుడ్ చుట్టూ చక్కర్లు కొడుతోందీ హాట్ బ్యూటీ. ఎంత చేసినా తెలుగు మేకర్లు పట్టించుకోవడం లేదు. అయినా సరే, టాలీవుడ్‌లో సినిమాలు చేయాలన్న ఆశ పోవటం లేదీ ముద్దుగుమ్మకి.

అందం, అభినయం అన్నీ వున్నాయ్. కానీ, అదృష్టమే ఆమడ దూరం పారిపోతోందీ అందాల భామకి. అప్పుడెప్పుడో చరణ్‌తో కలిసి డాన్స్ చేయాలని వుందంటూ తన మనసులోని మాట బయట పెట్టింది. కానీ, పని జరగలే.!
సోషల్ మీడియాలో బోలెడంత క్రేజ్ వుంది. కానీ, ఏం లాభం.! కేవలం గ్లామర్ డాళ్‌గా నెట్టింట పరిమితమైపోయింది. తెలుగులో ఓ మంచి సినిమాతో మళ్లీ తెరపై కనిపించాలన్న కోరికతో నేహా శర్మ చేయని ప్రయత్నమంటూ లేదు.
బాలీవుడ్‌లో ఒకటీ అరా సినిమాలు చేస్తోంది. కానీ, అమ్మడికున్న గ్లామర్ టాలెంట్‌కి అది చాలదు. అన్నట్లు ఈ మధ్య ఓటీటీలో ఆఫర్ల కోసం ట్రై చేస్తుందండోయ్.
Neha Sharma వెబ్ సిరీస్‌లతో సరిపెట్టుకోవల్సిందేనా.!
మనసు మార్చుకున్నట్లుంది. పెద్ద తెరపై అవకాశాలు దక్కకపోతేనేం.! ఓటీటీ తెరపై తన టాలెంట్‌కి పదును పెట్టాలనుకుంది కాబోలు.

వెబ్ సిరీస్‌లతో తన తడాఖా చూపించేందుకు సిద్ధమైంది నేహాశర్మ. ఆల్రెడీ రెండు వెబ్ సిరీసుల్లో నటించింది. అదే చేత్తో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసేసింది.
Also Read: సుస్మితా సేన్‌కి ‘హార్ట్ ఎటాక్’ రావడమేంటి.?
మంచి డాన్సర్ కదా.. తన డాన్సింగ్ టాలెంట్‌తో అలాగే, అడపా దడపా కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా కానిచ్చేసింది.
ఏమో లక్కు కలిసొస్తే.. మళ్లీ బిగ్ స్క్రీన్‌పై అదీ టాలీవుడ్ స్ర్కీన్‌పై త్వరలోనే నేహా శర్మని చూసే ఛాన్స్ వస్తుందేమో. లెట్స్ సీ.!