ఎంత స్నేహం వుంటే మాత్రం.. ఓ అమ్మాయి జుట్టు లాగాలని ఎలా అనిపించింది రవీ.? ఈ ప్రశ్న, ఈ రోజు నామినేషన్ ఎపిసోడ్ తర్వాత ప్రతి ఒక్కరికీ అనిపించడం ఖాయం. ‘నేను తప్పు చేశాను. ముగ్గురికి క్షమాపణ చెప్పాలి. నా జీవితంలోనే గత శనివారం అత్యంత బ్యాడ్ డే. ప్రియ, లహరి అలాగే మా అమ్మకి క్షమాపణ చెబుతున్నా..’ అంటూ రవి (Gunta Nakka Ravi) వాపోయాడు.
‘అమ్మ మీద ఒట్టేసి కూడా అబద్ధమే చెప్పాను.. నన్ను నేను క్షమించుకోలేను..’ అని రవి అనగానే, రవిలోని జెన్యూనిటీ కనిపించింది అందరికీ. లహరి మీద అంతటి అబాంఢం మోపడం వల్ల రవి ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయిపోయింది మరి. నాగార్జున, ఆ రహస్యాన్ని బయటపెట్టకుండా వుండి వుంటే.. ఇంకేమన్నా వుందా.?
ఇక, ఎలిమినేషన్ కోసం నామినేట్ చేయాల్సి వచ్చినప్పుడు నటరాజ్ అలాగే కాజల్ పేర్లను రవి పేర్కొన్నాడు. నటరాజ్‌ని నామినేట్ చేస్తూ, ‘మీరు పులి.. నేనేమో గుంట నక్క. అలాగని మీరనుకుంటున్నారు. మీ దృష్టిలో ఆ గుంట నక్కని నేనే. కానీ, ఎందుకు.?’ అని ప్రశ్నించాడు రవి. గుమ్మడికాయల దొంగ.. అనగానే భుజాలు తడుముకోవడమంటే ఇదే మరి.
రవి గుంట నక్క అవునా.? కాదా.? అన్న సంగతి పక్కన పెడితే, నటరాజ్ మాస్టర్‌ని మాత్రం పులిని చేసి పారేశాడు ఒక్క డైలాగుతో రవి. ఇది అనూహ్యం. బిగ్ బాస్ వీక్షకులంతా ఆశ్చర్యపోతున్న అంశం.
అప్పటిదాకా నటరాజ్ మాస్టర్ మీద వున్న నెగెటివిటీ అంతా మాయమైపోయి, రవి మీద బ్యాడ్ ఇంప్రెషన్ చాలామందికి షురూ అవుతుంది.. ఆ స్థాయిలో వుంది రవి అతి తెలివి. ఇక, కాజల్‌ని నామినేట్ చేయడానికీ ఓ చెత్త రీజన్ తీశాడు రవి. కాజల్ ఎప్పుడో రవిని కొట్టిందట.. అది రవి గుండెకు (మనసుకి) నొప్పి కలిగించిందట.
కాజల్ ఊరుకుంటుందా.? ‘నా జుట్టు పట్టుకుని లాగావ్.. నొప్పితో విలవిల్లాడాను. అప్పుడే ఆ విషయం చెప్పాను. నాకు నువ్వు క్షమాపణ కూడా చెప్పావ్. బాధ కలిగితే అప్పుడే చెప్పాలి. స్నేహంగా వున్నప్పుడు, ఆ విషయాన్ని దాచి, ఎలిమినేషన్ ప్రక్రియలో నామినేట్ చేయడానికి ఉపయోగించడం హాస్యాస్పదం’ అని కాజల్ చెప్పింది. ఇక్కడ కాజల్ నుంచి వ్యాలీడ్ పాయింట్ కనిపిస్తోంది.
ఇదిలా వుంటే, హౌస్‌లో హీటెడ్ ఆర్గ్యుమెంట్లు చాలానే జరిగాయి.. నామినేషన్ పర్వం కదా. అదంతే. నిజానికి, 90 శాతం చెత్త రీజన్స్ చెప్పి నామినేట్ చేసుకున్నారు. నామినేట్ అయినవారిలో నటరాజ్, లోబో, రవి (Gunta Nakka Ravi), ప్రియ, కాజల్, సన్నీ, యానీ, సిరి వున్నారు. వీరిలో ఎవరి వికెట్ ఈ వీకెండ్‌లో పడుతుందో వేచి చూడాలి.