Table of Contents
Halloween Beautiful Devils.. దెయ్యాలు బాబోయ్ దెయ్యాలు.. కొరివి దెయ్యాలు.. పైగా అందమైన దెయ్యాలు.. ఆ అందానికి వికృతంగా రంగులేసుకుని మరీ, భయపెట్టే దెయ్యాలు..
భయపెట్టే క్రమంలో విచ్చలవిడిగా అందాల ప్రదర్శన చేసే హాట్ అండ్ వైల్డ్ దయ్యాలు.
ఆగండాగండి.! ఈ దెయ్యాల గోలేంటీ.! ఈ రంగుల గోలేంటీ.! అసలిదంతా ఎక్కడి నుంచి వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో దెయ్యాల పండగ ఒకటుంది. ఆ పండగ కోసం దెయ్యాల్లా మారిపోతారంతా.!

దాన్నే ‘హాలోవీన్’ అంటారు. చనిపోయిన వారి ఆత్మలు ఈ భూమ్మీదకి వస్తాయని కొందరి నమ్మకం. ప్రతీ సంవత్సరం అక్టోబర్ 31న ఈ ‘హాలోవీన్’ అనే పండుగని నిర్వహించుకుంటారు.
Halloween Beautiful Devils.. పంట కాలం ముగిసిన తర్వాత..
పంటకాలం ముగిసిన తర్వాత చలికాలం మొదలవుతుందనీ, అప్పుడే ఆత్మలు భూమ్మీదకి వస్తాయనీ నమ్మేవారు. దుష్ట ఆత్మల నుంచి రక్షణ కోసం మంటలు వెలిగించి చిత్ర విచిత్రమైన దుస్తులు ధరించేవారు.
చిత్ర విచిత్రమైన దుస్తులు.. కాల క్రమంలో మరింత చిత్రంగా మారిపోయాయ్. ముఖానికి మాస్కులు ధరించడం.. రకరకాల రంగులు ముఖానికి పూసుకోవడం.. ఇవన్నీ కాలకమ్రంలో వచ్చిన మార్పులు.

మొదట్లో చాలా తక్కువ మందికి మాత్రమే పరిమితమైన ఈ పండుగ ఇప్పుడు విశ్వ వ్యాపితమైంది. భయం అటకెక్కి, ఫన్ ముందుకొచ్చింది.
పిల్లలు, పెద్దలు సరదాగా విచిత్ర వేష ధారణలో ఎంజాయ్ చేయడమే ‘హలోవీన్’ ఫెస్టివల్‌గా మారిపోయింది.
ఇంకొంచెం పైత్యం పెరిగి, నైట్ పార్టీలూ, అందులో లిక్కర్, డ్రగ్స్.. ఇలా బోలెడన్ని పైత్యాలు పండగ అర్ధాన్ని మార్చేశాయ్.
పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్లు..
పులి నక్క.. వాతలు.. ఈ సామెతతో పోల్చడం సబబా.? కాదా.? అనే విషయం పక్కన పెడితే, అసలు హాలోవెన్ అంటే ఏంటీ.? అని కనీస పరిజ్ఞానం లేకుండా మన సెలబ్రిటీలకి.
మరీ ముఖ్యంగా హీరోయిన్లు హాలోవెన్ పేరు చెప్పి సోషల్ మీడియా వేదికగా తమ గ్లామరస్ పైత్యాన్ని చాటుకుంటున్నారు.

చూస్తున్నారుగా.! ఇవి కొన్ని కొరివి దెయ్యాలు మాత్రమే. ఇంకా పదుల సంఖ్యంలో, వందల సంఖ్యలో గ్లామరస్ దెయ్యాలు. హలోవీన్ మాయలో పడి.. సోషల్ మీడియాలో పిశాచాల్లా తిరుగున్నాయ్.
వెర్రి వెయ్యి విధాలు.. అని పెద్దలు చెప్పేవారు. అలాంటి ఓ వేలం వెర్రి ఇది.!
ఇంతకీ, ‘హలోవీన్’ అంటే ఏం చేస్తారు.? అంటే, దానికో పెద్ద కథ వుంది. చిత్ర విచిత్రిమైన వేష ధారణల్లో తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్లి చాక్లెట్లూ, స్వీట్లూ అడుగుతారు.
పద్ధతులూ వున్నాయ్..
గుమ్మడికాయల్ని కోసి అందులో దీపాలు పెట్టి వాటిని భయంకరంగా తయారు చేస్తారు. కొందరు హాలోవీన్ పార్టీలు చేసుకుంటారు. పిల్లా, పెద్దా తేడా లేకుండా అందరూ రకరకాల వేష ధారణల్లో కనిపిస్తారు.
సూపర్ హీరోలు, దెయ్యాలు.. ఇలా భిన్నమైన గెటప్స్ వుంటాయ్. హాంటెడ్ హౌస్ తరహాలో తమ ఇళ్లను డెకరేట్ చేసుకుంటారు. ఆ ఇళ్లల్లో సరదాగా రకరకాల ఆటలు ఆడతారు.
Also Read: కామెడీ కాదు, ‘కామమ్ ర్యాంప్’.!
‘హలోవీన్’ అంటే నిజానికి ఒక్కరోజుకే పరిమితం. కానీ, ఇప్పుడు లెక్కలు మారిపోయాయ్.! ఇదో పబ్లిసిటీ స్టంట్ అయిపోయింది.

పార్టీ కల్చర్ అనే పైత్యం ముదిరిపోయాకా.. వారం రోజుల పాటూ, నెలరోజుల పాటూ ‘హలోవీన్ వీక్’, ‘హలోవీన్ మంత్’ అని పేరుతో హలోవీన్ పండగ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు.
