Hanuman First Review.. సినిమా పేరేమో ‘హనుమాన్’. సూపర్ మ్యాన్, బ్యాట్ మాన్ తరహాలో ఇది హను మ్యాన్.. అన్నమాట.!
కానీ, హనుమంతుడు సినిమా ప్రమోషన్లలో కనిపిస్తున్నాడు. పోస్టర్ల మీదా దర్శనమిస్తున్నాడు. ఆ హనుమంతుడికీ ఈ సినిమా కథకీ సంబంధమేంటి.? అది మాత్రం తెరపై చూడాల్సిందే.!
బాల నటుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన సినిమా ఇది.!
ప్రశాంత వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
సినిమా థియేటర్ల లొల్లి కాస్తా ‘హనుమాన్’ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ‘హనుమాన్’ సినిమాకి థియేటర్లు సరిగ్గా తెలునాట కేటాయించలేదు.
ఇదిలా వుంటే, కాస్సేపట్లో సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ పడనున్నాయి. ఈలోగానే, ‘హనుమాన్’ సినిమాకి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
Hanuman First Review.. తరణ్ ఆదర్శ్ తొలి రివ్యూ..
ప్రముఖ బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ తరణ్ ఆదర్శ్, ‘హనుమాన్’ (Hanuman Movie) సినిమాకి రివ్యూ ఇచ్చేశాడు ట్విట్టర్ వేదికగా.
‘మూడున్నర’ రేటింగ్ ఇచ్చిన తరణ్ ఆదర్శ్ (Taran Adarsh), సినిమా నిడివిని కొంత సమస్యగా పేర్కొనడం గమనార్హం.
తొలి సగం కాస్తంత సాగదీసినట్లు వుందనీ, ఓవరాల్‌గా సినిమా అద్భుతంగా వుందని తరణ్ ఆదర్శ్ పేర్కొనడం గమనార్హం.
తేజ సజ్జ (Teja Sajja), వరలక్ష్మి శరత్ కుమార్ తదితరుల నటన సినిమాకి ఎస్సెట్ అని ప్రస్తావించాడు తరణ్ ఆదర్శ్ తన షార్ట్ రివ్యూలో.!
తరణ్ ఆదర్శ్ రివ్యూని నమ్మొచ్చా.? గతంలో మంచి సినిమాలకి చెత్త రివ్యూలు, చెత్త సినిమాలకి మంచి రివ్యూలు ఇచ్చిన దరిమిలా, అతని రివ్యూల విశ్వసనీయత ఎంత.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
‘హనుమాన్’ సినిమా మీద అయితే ప్రీ రిలీజ్ పాజిటివ్ బజ్ వేరే లెవల్‌లో వుందన్నది నిర్వివాదాంశం. ఈ సినిమాలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది.