‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’ తర్వాత.. అని తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలి.. కాదు కాదు, ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఔను, ‘బాహుబలి’ ప్రస్తావన లేకుండా సినిమాలు, రాజకీయాలు.. ఏవీ వుండటంలేదు. ‘అతి పెద్ద ఘనత’ గురించి చెప్పాలంటే, ‘బాహుబలి’.. అనేస్తున్నారంతా. అదీ ప్రభాస్ (Happy Birthday Prabhas) ‘బాహుబలి’ ఘనత.
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ రెండు భాగాలుగా విడుదలైంది. ఒకదాన్ని మించి ఇంకోటి సంచలన విజయాన్ని అందుకోవడం.. అదీ జాతీయ స్థాయిలో కనీ వినీ ఎరుగని రీతిలో వసూళ్ళ పంట పండించాయి.
ఇండియన్ బాహుబలి..
‘హిందీ సినిమా లేదు, తెలుగు సినిమా లేదు, తమిళ సినిమా లేదు.. ఇప్పడంతా ఒకటే సినిమా.. అదే ఇండియన్ సినిమా..’ అని వివిధ సినీ పరిశ్రమలంతా ముక్త కంఠంతో నినదిస్తున్నాయంటే.. దానిక్కారణం ముమ్మాటికీ ‘బాహుబలి’ మాత్రమేనని చెప్పక తప్పదు.
Also Read: రావణ దహనం.. రామ రావణ యుద్ధంలో తెలుసుకోవాల్సింది ఇదే.?
జక్కన్న తెరకెక్కించిన ‘బాహుబలి’ తర్వాత, ‘సాహో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్ కొంత మేర దక్షిణాది ప్రేక్షకుల్ని నిరాశ పరిచినాగానీ, పాన్ ఇండియా స్థాయిలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే వసూళ్ళను రాబట్టడం గమనార్హం.
ఇక, ఇప్పుడు ‘రాధేశ్యామ్’ అంటున్నాడు.. ‘సలార్’తో సత్తా చాటుతానంటున్నాడు.. ‘ఆదిపురుష్’తో వసూళ్ళ ప్రభంజనమే.. అంటున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి వుండడం ప్రభాస్ నైజం. అందుకే, ‘బాహుబలి’ ప్రభాస్.. అనడం కన్నా, ‘డార్లింగ్’ ప్రభాస్.. అనే ఆయన్ని ఎక్కువగా పిలుస్తుంటారు.

ఈసారి చాలా చాలా స్పెషల్..
తన సినిమాల ప్రమోషన్ సంగతెలా వున్నా, ఇతర సినిమాల ప్రమోషన్ కోసం తనవంతుగా సహకరిస్తుంటాడు డార్లింగ్ ప్రభాస్. అలా ప్రభాస్ చేతుల మీదుగా ఎన్నో ప్రోమోస్ విడుదలయ్యాయి.. వాటిల్లో చాలావరకు సంచలన విజయాలూ అందుకున్నాయి. అందుకే ప్రభాస్ అందరికీ ‘డార్లింగ్’ అయిపోతుంటాడు.
ప్రతి పుట్టినరోజూ ప్రత్యేకమే.. ఈసారి అంతకు మించి ప్రత్యేకం.. ఎందుకంటే, ప్రభాస్ నుంచి రావాల్సిన సినిమాల లిస్ట్ పెరిగిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి.. ఎక్కువ గ్యాప్ లేకుండా వరుసగా ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ సినిమాలొచ్చేయబోతున్నాయ్.. ఇంతకు ముందెన్నడూ లేని పెద్ద లైనప్ ఇది.. పాన్ ఇండియా లైనప్ ఇది. హ్యాపీ బర్త్ డే ప్రభాస్. Happy Birthday Prabhas.