Happy Birthday OG Sujeeth.. సుజీత్ అంటే.! ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన యువ కెరటం.!
రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘సాహో’ లాంటి లార్జ్ స్కేల్ సినిమా రూపొందించిన దర్శకుడు సుజీత్.!
కానీ, ‘సాహో’ తర్వాత, సుజీత్ తదుపరి సినిమా చేయడానికి ఒకింత కిందా మీదా పడాల్సిన పరిస్థితి. అప్పుడే, పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్‌లో సినిమాపై అనౌన్స్‌మెంట్.!
‘అసలు.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్ళాలి.? ఎప్పుడు విడుదలవ్వాలి.?’ ఇలాంటి కామెంట్స్ సుజీత్ చాలానే ఎదుర్కొన్నాడు.
Happy Birthday OG Sujeeth.. సినిమా ఆగిపోయిందన్నారు..
‘సినిమా ఆగిపోయింది..’ అంటూ, ‘ఓజీ’ సినిమా గురించిన ప్రచారం జరిగింది. ‘సుజీత్ కెరీర్ ముగిసిపోయినట్లే..’ అని చాలామంది సెటైర్లు కూడా వేసుకున్నారు.
‘ఓజీ’ సినిమా మీద పుట్టుకొచ్చిన నెగెటివిటీ, బహుశా ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా మీదా వచ్చి వుండదేమో.!
కానీ, ‘ఓజీ’ గ్లింప్స్ దగ్గర్నుంచి, ‘ఓజీ’ సినిమా రిలీజ్ అయ్యేదాకా.. కామ్‌గా.. చాలా కామ్‌గా పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు దర్శకుడు.!
‘టెక్నీషియన్లని ఎలా వాడాలో సుజీత్ కంటే బాగా ఎవరికీ తెలియదు..’ అనే అభిప్రాయం, ‘ఓజీ’ విడుదలయ్యాక, అంతా ఒప్పుకున్నారు.!
Also Read: బాబోయ్ అమ్రికా.! ఫర్లేదు.. మరీ అంత భయం లేదు లేవోయ్.!
వెండితెరపై పవన్ కళ్యాణ్‌ని ఎలా చూపించాలో, సుజీత్ కంటే బాగా ఇంకెవరికి తెలుసు.? అని తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు మాట్లాడుకుంటోంది.
‘జానీ’ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని చూసిన సుజీత్, ఆ ‘జానీ’ పాటని, ‘ఓజీ’లో రీ-మిక్స్ చేశాడంటే, అతని గట్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.!

సుజీత్ పుట్టిన రోజు నేడు.! ఈ సందర్భంగా అంతా ‘ఓజీ సుజీత్’ అంటూ.. బర్త్ డే విషెస్ అందిస్తున్నారు.!
నిజమే.. ఇప్పుడు సుజీత్ అంటే, సాదా సీదా సుజీత్ కాదు.! ఓజీ సుజీత్.! నాని – సుజీత్ కాంబినేషన్‌లో సినిమా ఇటీవల అనౌన్స్ అయ్యింది.
‘ఓజీ’కి సీక్వెల్, ప్రీక్వెల్ కూడా రాబోతున్నాయి.! అంటే, సుజీత్.. రానున్న రెండు మూడేళ్ళు క్షణం తీరిక లేకుండా బిజీ అయిపోయినట్లే.!
సుజీత్ నుంచి మరిన్ని సిల్వర్ స్క్రీన్ వండర్స్ వస్తాయని ఆశిద్దాం.!
హ్యాపీ బర్త్ డే ఓజీ సుజీత్.!
