Happy Birthday Vishwak Sen.. ఓ చిన్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ, ఇప్పుడు ఓ స్టార్ హీరోకి ఏమాత్రం తగ్గని క్రేజ్ అతని సొంతం.!
దాదాపుగా ప్రతి సినిమాకీ ఫ్లాప్ లేదా డిజాస్టర్ టాక్ ఎదుర్కొంటూనే వున్నాడు. అది ‘పాగల్’ విషయంలో అయినా, ‘దాస్ కా ధమ్కీ’ విషయంలో అయినా.!
సినిమా అంటే అతనికి కిక్కు.! ఆ కిక్కుని తాను ఎంజాయ్ చేయడమే కాదు, అభిమానులకీ ఎక్కిస్తుంటాడు.
ఈ క్రమంలో విశ్వక్ సేన్ చేసే పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు.!
వివాదమైన, విజయమైనా.. విశ్వక్ సేన్ రూటే సెపరేటు.!
ఏదో మ్యాజిక్ లేకపోతే, విశ్వక్ సేన్ అనూహ్యంగా ఈ స్థాయి స్టార్‌డమ్ సొంతం చేసుకోగలడా.?
Mudra369
అతనెవరో కాదు మాస్ కా దాస్ విశ్వక్ సేన్.! సినిమా సినిమాకీ రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. నటుడు మాత్రమే కాదు దర్శకుడు, నిర్మాత కూడా.!
యంగ్ టైగర్ సినిమాకి దర్శకత్వం వహిస్తానంటూ..
దర్శకత్వం వహించే ఛాన్స్ వస్తే, యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో అదరగొట్టే సినిమా తీస్తానంటున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్.
అనూహ్యంగా నందమూరి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా మారిపోయాడు విశ్వక్ సేన్ (Vishwak Sen). అలాగని, మెగా కాంపౌండ్‌కో, మరో పెద్ద హీరోకో శతృవు కాలేదు.

మాస్ కా దాస్‌ని (Mass Ka Das Vishwak Sen) ఇష్టపడని సినీ ప్రముఖులు ఇప్పుడు ఇండస్ట్రీ లేరనడం అతిశయోక్తి కాదేమో.!
Happy Birthday Vishwak Sen.. రెచ్చగొడతాడు.. సందడి చేస్తాడు..
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాడు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారతాడు. ఏం చేసినా, అన్నీ సినిమా కోసమే.! విశ్వక్ సేన్ రేంజ్ ఎంత.? అంటే, అనూహ్యమైన రేంజ్ అయిపోయిందిప్పడు.
Also Read: ఆ ‘చిరుత’నయుడే.! ఈ మెగా గ్లోబల్ స్టార్.!
ఈ సక్సెస్ తనను అభిమానించే అభిమానులకే అంకితమంటాడు మాస్ కా దాస్. యూత్‌లో మనోడికి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
వెరసి.. మాస్ కా దాస్ కాస్తా.. మాస్ కా మ్యాజిక్ దాస్ అయిపోయాడు. హ్యాపీ బర్త్ డే మాస్ కా మ్యాజిక్ దాస్ విశ్వక్ సేన్. Happy Birtdhay Vishwak Sen.