Hari Hara Pawan Kalyan.. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘హరి హర వీర మల్లు’ సినిమాని అడ్డంగా నరికేస్తున్నారట.!
వినడానికి కాస్తంత చిత్రంగా వున్నాగానీ.. ఇదే నిజమట.! అసలేంటి ఈ నరికెయ్యడం.? ఎందుకీ నరుకుడు వ్యవహారం.!
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ ‘హరి హర వీర మల్లు’.!
తెరకెక్కుతోంది.. అనడం ఎంతవరకు సబబు.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ. ప్రస్తుతానికైతే తాత్కాలికంగా సినిమా ఆగిపోయింది.
Hari Hara Pawan Kalyan.. పెద్ద సినిమానే.. చాలా చాలా పెద్దది.!
పెద్ద సినిమా.. చాలా చాలా పెద్ద సినిమా.! బడ్జెట్ పరంగానే కాదు, స్కేల్ పరంగా కూడా.! భారీ సెట్స్ వెయ్యాలి.. చాలా హంగామా వుంది.!
కేవలం సినీ నటుడు మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్ అంటే, జనసేన అధినేత (Jana Sena Party Chief Pawan Kalyan) కూడా.. అన్న కనీస ఆలోచన లేకుండా ‘హరి హర వీర మల్లు’ సినిమా మొదలెట్టేశారని అనుకోలేం.
కాకపోతే, కోవిడ్ సహా అనేక సమస్యలు, ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాని ముందుకు కదలనీయలేదు. అదీ అసలు సమస్య.
2024 ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో అయితే, ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి. సో, జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో బిజీ అవుతారు.
నరికెయ్యడం కూడా మంచిదే..
అందుకే, ‘నరుకుడు’ వ్యవహారం తెరపైకొచ్చిందట. చేసిన షూటింగ్‌కి అనుగుణంగా, చిన్న చిన్న ప్యాచప్ వర్క్స్ చేసేసుకుంటే, మొదటి పార్ట్ విడుదల చేసెయ్యొచ్చన్నది ‘హరి హర వీర మల్లు’ టీమ్ ఆలోచనగా కనిపిస్తోంది.
ఇదే విషయాన్ని చూచాయిగా సెలవిచ్చారు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం. ‘రెండు పార్టులుగా సినిమా వుండొచ్చు..’ అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారాయన.
Also Read: భగవంత్ కేసరి Ganesh Anthem: చిచ్చా, బేటా.. కుమ్మేశారు.!
ఈ ఏడాది చివరి నాటికి సినిమాని పూర్తి చేసి, ఎన్నికల్లోపు విడుదల చేయాలనే ఆలోచనతో వున్నట్లు నిర్మాత ఏఎం రత్నం ప్రకటించడం.. పవన్ కళ్యాణ్ అభిమానులకి సంతోషాన్నిచ్చే విషయమే.!
ఈ ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్‌గా నటిస్తోంది.
మరోపక్క, పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల్లో ‘ఓజీ’తోపాటు, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా వుంది.! వీటిల్లో, ‘ఓజీ’ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.!