మొదట్లో సైలెంట్‌గా చాలా కూల్‌గా, అంతకు మించి బుద్ధిమంతురాలిగా కనిపించిన హిమజ (Himaja), రియల్ కలర్ బయట పడింది పునర్నవి, అలీ రెజాలకు (Ali Reza) బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడే. వారిద్దరూ హౌస్‌లో ఉంటే నాకేంటీ.? లేకుంటే నాకేంటీ.? అని హిమజ (Himaja Rahul Sipligunj) చెప్పాక, బిగ్‌హౌస్‌లో ఈక్వేషన్స్ మారిపోయాయి.
ఆ తర్వాత నుండీ హిమజ రోజుకో రకంగా వ్యవహరిస్తోంది. ఒక్కోసారి ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వస్తోన్న హిమజ, ప్రస్తుతం రాహుల్‌కి గురి పెట్టింది. తనను రాహుల్ బలవంతంగా నెట్టేశాడంటూ, యాక్షన్ చేసి మరీ హిమజ చెప్పిన తీరు, ఆమెలోని వైలెంట్ యాంగిల్‌ని ఇంకోసారి నిరూపించింది. అయితే, అలవోకగా అబద్ధాలు చెప్పేసే ఆమె నైజం ప్రతీసారీ బయట పడిపోతోంది.
రాహుల్ మామూలుగా చేయి పట్టుకున్న విషయాన్ని హిమజ సీరియస్‌గా తీసుకుని, ‘తోసేశావ్’ అని చెప్పడం హాస్యాస్పదం. ఓ ఆడపిల్లని భుజం మీద చేయి పెట్టి తోసేయడం అనే ప్రక్రియ నెగిటివ్ వైబ్స్ కలిగిస్తుంది. తన మీద ఆ నెగిటివిటీని హిమజ సృష్టించడం నచ్చని రాహుల్ (Himaja Rahul Sipligunj), జరిగిందేంటో చెప్పేందుకు ప్రయత్నించాడు.
రాహుల్ చెప్పింది నిజమేనని చేయి పట్టుకున్నాడనీ హిమజ కూడా ఆ తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. విషయం రాంగ్‌గా కన్‌వే చేయడం ఎలాగో హిమజకు బాగా తెలుసు. రాహుల్ వెర్షన్ ఎడిట్ అయిపోలేదు కాబట్టి, అతని బాధేంటో అందరికీ తెలిసింది. లేకపోతే, శ్రీముఖి కారణంగా ఇప్పటికే బ్యాడ్ అయిపోయిన రాహుల్, హిమజ కారణంగా మరింత బ్యాడ్ అయిపోయేవాడేమో. అన్నట్లు శ్రీముఖి ఇంపాక్ట్ హిమజ మీద బాగానే పని చేస్తోంది.