Table of Contents
ఒకప్పుడు మేకప్ అంటే, కొందరికే సొంతం. మేకప్ వేసుకోవడంపై భిన్నాభిప్రాయాలుండేవి కూడా. ఆ మేకప్పేంటి.? ఆ పద్ధతేంటి.? అనే విమర్శలు తరచూ వినిపించేవి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. వయసుతో సంబంధం లేకుండా అందంగా కనిపించేందుకు (Beauty Tips For Hair To Nail) తహతహలాడుతున్నారు. కురుల నుండి, గోర్ల వరకూ అంతా అందంగా కనిపించాలనుకుంటున్నారు. అందంగా కనిపించేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడ్డంలేదు.
నిజానికి అందం అంటే ఆకర్షణ మాత్రమే అనే భావన పోయి, అందం అంటే ఆత్మ విశ్వాసం అనే నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే మహిళలు అందంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అందుకే బ్యూటీ సెలూన్లు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయ్. మంచి లాభార్జన కూడా ఉంటుందీ బిజినెస్‌లో. వేలు, లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు బ్యుటీషియన్లు.
అయితే, బ్యూటీ సెలూన్లకు పోయి, వేలల్లో, లక్షల్లో డబ్బులు పాడు చేసుకునేకన్నా, కొద్దిపాటి అవగాహన ఉంటే, మన అందాన్ని మనమే సంరక్షించుకోవచ్చు. అందుకు ఈ చిన్న చిన్న టిప్స్ మీకోసం.

అందమైన హెయిర్ కోసం ఇలా ట్రై చేస్తే పోలా..
అమ్మాయికి అందం పొడుగాటి కురులు. అనేక కారణాల వల్ల హెయిర్ లాస్ అనేది పెద్ద సమస్యగా మారింది. హెయిర్ లాస్ నియంత్రణలో అవిసె గింజలు కీలక పాత్ర పోషిస్తాయని హెయిర్ నిపుణులు చెబుతున్న మాట. అవిసె గింజలను నీటిలో వేసి మరిగించగా వచ్చిన జెల్‌ని తలకు పట్టించి బాగా మర్దన చేసి, గంట తర్వాత స్నానం చేస్తే జుట్టు రాలడం అనే సమస్య తగ్గుతుందట. ఓ సారి ట్రై చేసి చూడండి.
ముఖంపై ముడతలు తగ్గాలా.?
శరీరం అలసిపోతే, చర్మమూ అలసిపోతుంది. అదే పాలిపోయినట్లు కనిపిస్తుంది. అందుకు కారణం చర్మంపై మృతకణాలు. అందుకు ఓట్స్ పొడర్ మంచి ఔషధంగా పని చేస్తుంది. ఓట్స్‌ని నీటితో కలిపి పేస్ట్‌లా చేసి, ముఖంపై సున్నితంగా మర్దన చేస్తే, మృతకణాలు పోయి చర్మం తాజాగా మెరుస్తుంది. అలాగే, ఐస్ ప్యాక్ కూడా మృత కణాలను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఐస్ క్యూబ్స్‌తో ముఖంపై స్మూత్‌గా అటూ ఇటూ మర్దన చేస్తే చాలు.

కంటి కింద క్యారీ బ్యాగులు పోవాల్సిందే..
వయసుతో పాటు వచ్చే మార్పులే కాదు, అనవరసరమైన మేకప్ క్రీములు వాడడం వల్ల కూడా కంటి కింద క్యారీ బ్యాగులొచ్చేస్తున్నాయి. కంటి కింద చర్మం కూడా నల్లగా మారుతుంది. వీటిని తగ్గించుకోవాలంటే ముఖ్యంగా చేయాల్సిన పని, సరిపడా నిద్ర. అలాగే, పడుకునే ముందు కంటి కింద కొబ్బరి, లేదా, బాదం, ఆలివ్ నూనెతో కాస్త అటూ ఇటూ మర్దన చేసినా మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాత్రి పడుకునే ముందు కళ్ల కింద నేతితో కూడా మర్దన చేసుకోవచ్చు.
గోళ్ల సంరక్షణ కోసం ఏం Beauty Tips ఫాలో అవ్వాలంటే..
ముఖమే కాదు, అందానికి సంబంధించి గోళ్లదీ ముఖ్య పాత్రే. అయితే, గోళ్ల విషయంలో చాలా తక్కువ శ్రద్ధ తీసుకుంటుంటారు. పదే పదే నీటిలో నానడం వల్ల తేమను కోల్పోయి, గోళ్లు బలహీనంగా మారి, నిర్జీవంగా అయిపోతాయి. ఆ సమస్యను చాలా తేలికగా ఈ చిన్న టిప్ ( Beauty Tips For Hair To Nail ) ద్వారా అధిగమించొచ్చు.

గోరు వెచ్చని నీటిలో కొద్దిగా వెనిగర్ లేదా నిమ్మరసం, కొద్దిగా సాల్ట్ మరియు కలబంద గుజ్జును వేసి ఓ అరగంట సేపు చేతులు, కాలి గోళ్ల్లు ముగిగేలా ఉంచాలి. వారానికి కనీసం రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
చివరగా.. అందంగా కనిపించాలంటే.. ఆరోగ్యంగా వుండాలి. కంటి నిండా నిద్ర.. శరీరానికి తగినంత ఆహారం.. ప్రతిరోజూ వ్యాయామం.. ఇవన్నీ చేస్తే, నఖ శిఖ పర్యంతం.. ఆరోగ్యంగా, అందంగా వుండొచ్చునని పెద్దలు చెబుతుంటారు. వైద్యులూ అదే మాట చెబుతారండోయ్.