Hrithik Roshan JrNTR War2 .. నార్త్ అండ్ సౌత్.. ఆ బౌండరీస్ ఎప్పుడో చెరిగిపోయాయ్.! ఇప్పుడంతా ఇండియన్ సినిమా.! ఇప్పడిక ‘పాన్ ఇండియా’ అనే మాట మాట్లాడుకోవడం కూడా అనవసరం.!
అసలు విషయమేంటంటే… హృతిక్ రోషన్, ఎన్టీయార్ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు. అదే ‘వార్-2’. గతంలో ‘వార్’ సినిమా కోసం హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే.
ఆ ‘వార్’ యూనివర్స్‌లోకి ఈసారి కొత్త ఎంట్రీ యంగ్ టైగర్ ఎన్టీయార్ అన్నమాట.! ఈ విషయమై అధికారిక ప్రకటన దాదాపుగా వచ్చేసినట్లే.
Hrithik Roshan JrNTR War2.. గ్లోబల్ సినిమా.!
ఇక నుంచి పాన్ ఇండియా సినిమా అనే ప్రస్తావన వేస్ట్.! ఇకపై అంతా గ్లోబల్ సినిమా అనుకోవాలేమో.! హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీయార్ కలిసి చేయబోయేది కూడా గ్లోబల్ సినిమానే కానుంది.
ఈ కాంబినేషన్ సెట్టయితే.. ఆ కిక్కే వేరప్పా.!
సౌత్, నార్త్ బౌండరీస్ చెరిగిపోయి చాలాకాలమే అయ్యిందిగానీ..
‘వార్-2’లో హృతిక్, ఎన్టీయార్ సృష్టించబోయే మాస్ అరాచకం ఏ రేంజ్లో వుంటుందో.!
పాన్ ఇండియా కాదు.. గ్లోబల్ సినిమా ఇప్పుడు.!
Mudra369
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఈ బౌండరీస్ చెరిగిపోవడం ఆహ్వానించదగ్గ పరిణామమే. సౌత్ హీరోలు, నార్త్ హీరోలు.. అన్న తేడాల్లేవ్. అందరూ ఇండియన్ హీరోలే.! వాళ్ళిప్పుడు గ్లోబల్ ఇమేజ్ దక్కించుకుంటున్నారు.
మ్యాచ్ అవుతుందా.?
డాన్సింగ్ సెన్సేషన్స్.. అంటే, ఆ లిస్టులో హృతిక్ రోషన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఆ హృతిక్ రోషన్‌తో ‘వార్’ సినిమా కోసం డాన్సుల్ని మ్యాచ్ చేశాడు టైగర్ ష్రాఫ్ తనదైన స్టయిల్లో.
ఇప్పుడిక యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) వంతు. డాన్సుల్లో ఎన్టీయార్ (Jr NTR) స్టామినా గురించి కొత్తగా చెప్పేదేముంది.?
Also Read: ప్రబాస్ మీద పగ తీర్చుకుంటున్న ‘ఆదిపురుష్’ టీమ్.!
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘ఎన్టీయార్30’ సినిమా చేస్తున్నాడు కొరటాల శివ దర్శకత్వంలో. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు.
మరి, ‘వార్-2’ కోసం జూనియర్ ఎన్టీయార్ ఎలా డేట్స్ అడ్జస్ట్ చేస్తాడబ్బా.?