Hyderabad Central University Lands.. మనిషి బతకాలంటే, నేల తల్లికి గాయాలు చేయాల్సిందే.! మనిషి మనుగడ సాధించాలంటే, వన్య మృగాల మనుగడని ప్రశ్నార్థకం చేయాల్సిందే.!
ఔను, నిజ్జంగా నిజం.! ఇంకెందుకు అటవీ పర్యావరణ శాఖ.? అదే మ్యాజిక్కు.! అడవుల్ని ఆక్రమిస్తున్నాం.. అభివృద్ధికి బాటలేస్తున్నామని చెప్పుకుంటున్నాం.
అసలు అభివృద్ధి అంటే ఏంటి.? ఈ భూమి, కేవలం మనుషులదే కాదు. పశు పక్ష్యాదులది కూడా.! మొత్తం ఆక్రమించేసుకుని ఏం సాధిస్తాం.?
మనిషొక్కడే భూమ్మీద బతకాలనుకుంటే, అది సాధ్యమా.? ఆ మాత్రం సోయ వుంటే, ఇన్ని అనర్థాలెందుకు జరుగుతాయి.? నీరు కలుషితం, గాలి కలుషితం.! చివరికి మనిషి మనుగడే ప్రశ్నార్థకం.
కూర్చున్న కొమ్మని నరుక్కోవడమే..
నిజమే, మనిషికి అన్నీ తెలుసు.! తెలిసే, కూర్చున్న కొమ్మని నరుక్కుంటాడు. హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూముల్ని తెలంగాణ ప్రభుత్వం అమ్మేస్తోందంటూ రచ్చ జరుగుతోంది.
ఛస్తే ఛావనీ.. మూగ జీవాలే కదా.!
అవేం, కోర్టుల్ని ఆశ్రయించలేవు.. ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా తరహాలో, మనుషుల మీద దాడులూ చేయలేవు.
ఆక్రమించేద్దాం.. వన్య మృగాల్ని పూర్తిగా భూమ్మీద లేకుండా చేసేద్దాం.!
Mudra369
నిజానికి, ఒకప్పటి హైద్రాబాద్.. ఇప్పటి హైద్రాబాద్.. ఈ రెండిటికీ చలా తేడా. అటవీ భూములుగా ఒకప్పుడు కనిపించిన చాలా ప్రాంతాలు, ఇప్పుడు కాంక్రీట్ జంగిల్స్.
పరిపాలించడమంటే, భూముల్ని అమ్ముకోవడం.. అని పాలకులకు ఎవరు చెప్పారు.? ఫలానా భూమి అమ్మితే, వేల కోట్లు వస్తుందని లెక్కలేసుకునేటోడు పాలకుడెలా అవుతాడు.
దేశవ్యాప్తంగా చర్చ జరగాలి..
తెలంగాణ అనే కాదు, దేశవ్యాప్తంగా ఈ ప్రశ్న సాధారణ ప్రజల్లో చర్చనీయాంశమవ్వాల్సి వుంది. చర్చనీయాంశమవుతుందా మరి ఇప్పటికైనా.!
జనాభా పెరుగుతోంది కాబట్టి, పచ్చని పంట పొలాల్ని, అటవీ భూముల్ని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చెయ్యాల్సిందేనన్న వాదన ఎంతవరకు సబబు.?
ప్రభుత్వం దగ్గర భూముల్లేకపోతే, ముందు ముందు ప్రభుత్వావసరాల నిమిత్తం.. భూమిని, అంతరిక్షం నుంచి ఏమైనా తీసుకొస్తారా.? ఏం సమాధానమిస్తాయి రాజకీయ పార్టీలు.?