Idli Healthy Breakfast.. ఇండియన్ ఇడ్లీకి అభిమానులెక్కువ. ఇడ్లీ అంటేనే ఇండియా. ఇండియా అంటేనే ఇడ్లీ. దేశ వ్యాప్తంగా ఇడ్లీ అన్ని చోట్లా దొరుకుతుంది. ఇడ్లీ తయారీ ఎప్పుడు ప్రారంభమైందో తెలీదు కానీ, ఇడ్లీ రుచి తెలియని భారతీయుడెవడూ ఉండడు. విదేశీయులు సైతం ఇడ్లీని లొట్టలేసుకు తింటారు.
ఇడ్లీ అంటే ఏముంటుంది.? ఇడ్లీ ఎలా ఉన్నా దానికి, సరైన చట్నీకలిస్తేనే అసలు రుచి. చట్నీ కావచ్చు.. రకరకాల కారప్పొడులు కావచ్చు.. కుదిరితే సాంబారైనా కావచ్చు. చవులూరించే బ్రేక్ ఫాస్ట్ మన ముందున్నట్లే. ఇంతకీ ఇడ్లీకి ప్రత్యేకమైన రుచి ఏమీ ఉండదు. దాన్ని మనం అనుభూతి చెందాల్సిందే.
Idli Healthy Breakfast.. ఇడ్లీ.. ఎందుకంత ప్రత్యేకం.?
ఇప్పుడీ ఇడ్లీ పురాణం ఎందుకంటే, మీ ఫేవరేట్ ఫుడ్ ఏంటి.? అని అడిగితే, ఇడ్లీ.. ఓన్లీ ఇడ్లీ.. అని సమాధానమిచ్చింది ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్. ప్రముఖ నటి పైగా మోడలింగ్ రంగంలోంచి సినిమాల్లోకి వచ్చింది కాబట్టి విభిన్న రకాలైన రుచుల్ని ఆస్వాదించేసి వుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రత్యేక వంటకాల్ని రుచి చూసే ఉండాలి. మరి, ఇడ్లీ మీద నిధి అగర్వాల్‌కి ఎందుంత మమకారం.?

ఫిట్‌గా వుండాలంటే, సరైన ఆహారం తీసుకోవాలి. పొద్దున్నే అల్పాహారం, తేలికైనది తీసుకుంటే రోజు ఆరోగ్యవంతంగా ప్రారంభమవుతుంది. కాబట్టే, ఇడ్లీని ప్రిఫర్ చేస్తానంటోంది నిధి అగర్వాల్.
నిజమే, ఇడ్లీలో చాలా వున్నాయ్. శరీరానికి అవసరమైనంత శక్తినిస్తుంది ఇడ్లీ. కొవ్వు ప్రస్థావన వుండదు. చాలా తేలిగ్గా జీర్ణమైపోయే అల్పాహారం కూడా. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. పైగా తక్కువ ఖర్చుతోనే లభిస్తుంది కూడా.
కొంచెం తేలిగ్గా.. చాలా బలంగా..
నిధి అగర్వాల్ అనే కాదు, చాలా మంది హీరోయిన్లు అందుబాటులో రకరకాల దోసెలు, పూరీలు ఇతరత్రా అల్పాహార వంటకాలున్నా కానీ, ఇడ్లీతో సరిపెడుతుంటారు. ఇదండీ ఇడ్లీ కథ.
ఆగండాగండి.. ఇడ్లీ పిండిని పనస ఆకుల్లో పొందికగా పెట్టి ఆవిరి మీద వుడికిస్తే వాటిని ‘పొట్టిక్కలు’ అంటారు. అరిటాకులో వేడి వేడి ఇడ్లీ వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. ఆ ఫ్లేవర్ కూడా చాలా ప్రత్యేకంగా వుంటుంది. చిన్నచిన్న ఇడ్లీలుగా కాకుండా నాలుగైదు ఇడ్లీలకు సరిపడే పిండిని ఒకే ఇడ్లీగా వేసి, దాని మీద నెయ్యి లేదా బెల్లం పాకం వేసుకుంటే అబ్బో.. ఆ కిక్కే వేరప్పా.
Also Read: సర్వరోగ నివారిణి ‘గాడిద గుడ్డు’.. ఔనా.?
ఇడ్లీలో కూడా ఇన్ని రకాలున్నాయా.? ఈ మధ్య మినుములతోనే కాకుండా, రకరకాల తృణ ధాన్యాల్ని వినియోగించి కూడా రుచికరమైన ఇడ్లీలు (Idli Healthy Breakfast) తయారు చేస్తున్నారు.