Ileana D Cruz.. ఇలియానా, విద్యాబాలన్ (Vidya Balan) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని పలు భాషల్లోకి డబ్ చేసి ఒకేసారి విడుదల చేయబోతున్నారట. ప్రతీక్ గాంధీ, సెంథిల్ రామమూర్తి ఈ సినిమాలో ఇత ప్రధాన తారాగణం.
న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. అంటూ ఈ సినిమా గురించి చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మోడ్రన్ బంధాలు, బాంధవ్యాల గురించీ, రొమాన్స్ గురించీ ఈ సినిమాలో అత్యద్భుతంగా చూపించబోతున్నారట. అది కూడా ఎంటర్‌టైనింగ్ మార్గంలో చూపిస్తారట.
Ileana D Cruz సమ్‌థింగ్ కొత్తగా..
విద్యాబాలన్ ఏ సినిమాలో నటించినా, ఆ సినిమాకి ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఆమె మంచి మంచి సినిమాల్ని ఎంచుకోవడం చూస్తూనే వున్నాం. వాటిల్లో కొన్ని బోల్డ్ మూవీస్ కూడా వుంటాయి. అదే విద్యా బాలన్ ప్రత్యేకత.

ఇలియానా గురించి కొత్తగా చెప్పేదేముంది.? కెరీర్ ముగిసిపోయిందంటూ ఇలియానా గురించి ప్రచారం జరిగిన ప్రతిసారీ ఆమె తనదైన స్టయిల్లో బౌన్స్ బ్యాక్ అవుతుంటుంది. ఈ కొత్త సినిమా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఇలియానా (Ileana D Cruz) చెబుతోంది.
కాగా, సినిమాకి సంబంధించి తాజాగా విడుదల చేసిన లుక్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇద్దరు స్త్రీలు, ఇద్దరు పురుషులు కనిపిస్తున్నారు. వీళ్ళ మధ్య వున్న బంధమేంటి.? న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. అంటే, బోల్డ్ అంశాల్ని ఇందులో చర్చించబోతున్నారా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Nivetha Pethuraj ది రియల్ ఫైటర్.. ఎందుకంటే.!
2022లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. షీర్షా గుహ టకుర్తా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.