Inaya Sultana బిగ్ బాస్ హౌస్ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోదామా.? అనుకుంటున్నట్టుంది ఇనాయా సుల్తానా.
తెలుగు వెర్షన్ బిగ్ బాస్ సిక్స్ సీజన్ కంటెస్టెంట్లలో ఇనాయా సుల్తానా కూడా ఓ హాటెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పక తప్పదు.
ప్రముఖ వివాదాల ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ కారణంగా ఇనాయా సుల్తానా పాపులర్ అయ్యింది.. బిగ్ బాస్ కంటే ముందు.
వర్మ బ్రాండ్ అంటేనే, వివాదాలకు కేరాఫ్ అడ్రస్. బిగ్ హౌస్‌లో ఇనాయా సుల్తానా తీరు చూస్తోంటే, ఆ వర్మ నుంచి చాలా స్ఫూర్తి పొందినట్లే కనిపిస్తోంది.
Inaya Sultana అటెన్షన్ పాట్లు.. మరీ ఇంతలాగానా.?
అటెన్షన్ పొందడమెలా.? అన్న కోణంలో అయినదానికీ, కానిదానికీ రచ్చ రచ్చ చేసేస్తోంది. నిజానికి, ఇలాంటోళ్ళకి వేగంగా ఎగ్జిట్ డోర్ చూపించేస్తుంటారు బిగ్ బాస్ (Bigg Boss Telugu) నిర్వాహకులు.

సో, ఇనాయా ఎక్కువ రోజులు బిగ్ హౌస్‌లో వుండకపోవచ్చు. తన ఇరిటేటింగ్ వాయిస్‌కి తోడు ఇరిటేటింగ్ బిహేవియర్‌తో ఇనాయా బిగ్ బాస్ వీక్షకుల్ని మరింత చికాకు పెట్టేస్తోంది.
‘ముందు బయటకు పంపించెయ్ బిగ్ బాస్..’ అంటూ ఇనాయా గురించి సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ (Bigg Boss Telugu Season 6) వీక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంటికి దారేదీ.?
తొలి వారంలోనే.. అదీ షో (Bigg Boss Telugu 6) స్టార్ట్ అయిన రెండు మూడు రోజుల్లోనే ఇనాయాని (Inaya) తట్టుకోలేకపోతున్నారు అటు మిగతా కంటెస్టెంట్లు.. ఇటు వీక్షకులు.
Also Read: పెద్ద పేరు, అల్ప బుద్ధి.! అను‘రోగ్’ పబ్లిసిటీ తాపం.!
గ్లామరుంది.. కాస్తో కూస్తో పాపులారిటీ వుంది.. ఒకింత మైండ్ గేమ్ జాగ్రత్తగా ఆడితే, బిగ్ హౌస్‌లో ఎక్కువ వారాలు వుండేందుకు ఆస్కారమున్నా, మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతోంది ఇనాయా.!