Indian Army Operation Sindoor.. ఏసీ గదుల్లో కూర్చుని.. టైమ్ పాస్ చేసేవాళ్ళకీ, ఎండనకా.. వాననకా.. భయంకరమైన పరిస్థితుల్లో దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుడికీ ఎంత తేడా.?
ఆ సైనికుడికి, మనం సలహాలు ఇచ్చేంతటోళ్ళమా.? ఈ ప్రశ్న ఎవరికి వారు వేసుకుంటే, అసలు సమస్యే వుండదు.!
సైన్యం, అంతలా అక్కడ కష్టపడుతోంది కాబట్టే, ఇక్కడ మనం ఇంత హాయిగా బతకగలుగుతున్నాం. ఆ సైన్యమే లేకపోతే, మన బతుకులు ఏంటి.? అసలంటూ, మనకి బతుకు వుంటుందా.?
ఇంతకీ, సైనికుడంటే ఎవరు.? మనలాంటి మనుషులే. మన ఇంట్లోనివారు కూడా అయి వుండొచ్చు.! భరతమాత కోసం, ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల్ని త్యాగం చేస్తే, వాళ్ళే సైనికులవుతారు.
Indian Army Operation Sindoor.. ఎన్ని కోట్లిస్తే.. ప్రాణాలకు తెగించగలం.?
జీతం తీసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారనని సైనికుల విషయంలో అనగలమా.? కోటి రూపాయలిస్తామన్నా, మనం సరిహద్దుల్లోకి వెళ్ళి యుద్ధం చేయగలమా.?
భారత్ – పాక్ మధ్య యుద్ధ మేఘాల నేపథ్యంలో, కొందరు మేతావులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. యుద్ధం మంచిది కాదంటారు.! యుద్ధంతో బోల్డంత నష్టమంటారు.
ఔనా.? యుద్ధంతో నష్టమా.? యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్ని శతృవు కల్పించినప్పుడు, మూకుమ్మడిగా చచ్చిపోదామా.? శతృవు ముందు మోకరిల్లుదామా.? ఏం చెప్పాలనుకుంటోంది ఈ మేతావి సమాజం.?
మేతావులు నవరంధ్రాలు మూసుకుంటే మంచిది..
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మేతావి సమాజం వున్నపళంగా తమ నవరంధ్రాల్ని మూసుకుని వుంటే మంచిది.! లేదంటే, సరిహద్దు దగ్గరకి వెళ్ళి, శతృవుకి శాంతి వచనాలు నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు.
Also Read: కుక్కల్లా మొరిగితే.. లోపలేస్తాం: పవన్ కళ్యాణ్ హెచ్చరిక
సోషల్ మీడియాలోనో, టీవీ డిబేట్లలోనో.. ఈ శాంతి మంత్రాలు చెబితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
ఇంతకీ, ఈ బోడి సలహాలు ఇచ్చే మేతావి సమాజం, తమ కుటుంబం నుంచి ఎవర్నయినా, సైన్యంలోకి పంపిందా.? ప్చ్.. అంత సీన్ ఎవరికీ వుండి వుండదు.
సైన్యాన్ని గౌరవిద్దాం.. మేతావితనాన్ని పక్కన పెడదాం.!