Indian Political System Win.. మేం ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం.. అని పదే పదే రాజకీయ నాయకులు చెబుతుంటారు. ప్రజా క్షేత్రంలో తేల్చుకోవడమేంటి.? అంటే, ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని చెప్పడం.!
గెలవడం వేరు, నిజం వేరు. గెలిచేదంతా నిజం కాదు. ఓడిపోతే, అది నేరం కాదు.! దేశం ఎంతోమంది మహనీయుల్ని చూసింది. అహంకారంతో ఎగిరెగిరిపడ్డవాళ్ళనీ చూసింది.
‘మేం గెలిచాం..’ అని విర్రవీగినోళ్ళెందరో కాలగర్భంలో కలిసిపోయారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.!
ఎన్నికల వ్యవస్థ, దేశంలో ప్రజాస్వామ్యం ఎలా వున్నాయో.. ఎన్నికల వేళ అందరం చూస్తూనే వున్నాం.
మద్యం ఏరులై ప్రవహిస్తుంటుంది.. కరెన్సీ కోట్లు విచ్చలవిడిగా చెలామణీ అవుతాయ్..
కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో నడిచే దిక్కుమాలిన రాజకీయాలు.. బెదిరింపులు, ‘ఒక్క ఛాన్స్..’ అంటూ బతిమాలుకోవడాలు.. చెప్పుకుంటూ పోతే, ఎన్నికలంటేనే ప్రలోభాల ప్రసహనం.
గెలవం.. ‘గేలి’ చేయడం.!
ఇంత గొప్ప ఎన్నికల వ్యవస్థలో ‘గెలిచాం’ అని ఎవరైనా చెబితే, దానర్థం గెలిచాం అని కాదు, ప్రజాస్వామ్యాన్ని ‘గేలిచేశాం’ అని చెప్పడం.!

‘పశువుల దాణా’ కుంభకోణంలో మాజీ కేంద్ర మంత్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి దోషిగా తేలారు. కానీ, ఆయన్ని దోషిగా తేల్చడానికి న్యాయవ్యవస్థ సుదీర్ఘ సమయం తీసుకుంది.
ఈలోగా ఆయన ఎన్నికల్లో గెలిచారు, వివిధ రకాలైన పదవులూ చేపట్టారు. గెలిచాడు గనుక, ఆయన తప్పు చేయలేదని ప్రజా క్షేత్రంలో నిర్ధారణ అయ్యిందని అనగలమా.? పాపం పండేందుకు కొంత సమయం పడుతుందంతే.
Indian Political System Win.. పాపం పండాలంటే.!
తమిళనాడులో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సంగతేంటి.?
అవినీతి ఆరోపణలు, అక్రమ సంపాదన నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు.. ఆ తర్వాత ప్రజా క్షేత్రంలో సత్తా చాటారు.. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు.. ఆ తర్వాత అనారోగ్యంతో కన్నుమూశారు.
ఆ కేసులోనే, జయలలిత (Tamilnadu Jayalalitha) సహచరి శశికళ జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. ఒకవేళ జయలలిత జీవించి వుంటే, మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కోల్పోయి జైలుకు వెళ్ళేవారేనేమో.!
Also Read: నిత్యానంద కైలాసం.! సమాధిలో అయ్యోరి సయ్యాట.!
చెప్పుకుంటే ఇలాంటి వ్యవహారాలు దేశంలో చాలా కనిపిస్తాయ్.! గెలవడం అంటే, జస్ట్ గెలవడం అని మాత్రమే. తమ సచ్ఛీలతను ప్రజాక్షేత్రంలో నిరూపించుకున్నట్టు కానే కాదు.
– yeSBee