IndiGo Airline Crisis.. ఏం పాపం చేసుకున్నారో.. ఇండి‘గో’ ప్రయాణీకులయ్యారు.! ఇలాగే మాట్లాడుకుంటున్నారిప్పుడు ఇండిగో ఎయిర్‌లైన్స్ బాధితులు.!
విమాన ప్రయాణమంటేనే, విలాసవంతమైన ప్రయాణం. ఖర్చు ఎక్కువైనాసరే, తక్కువ సమయంలోనే గమ్యం చేరుకోవడం కోసమే కదా విమాన ప్రయాణాన్ని ఆశ్రయించేది.?
కానీ, విమాన ప్రయాణమంటేనే అసహ్యమేసేలా ప్రయాణీకుల్ని ఇబ్బంది పెడుతోంది ఇండిగో. కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలే, ప్రయాణీకులకు శాపంగా మారాయన్నది ఓ వాదన.
అదే నిజమైతే, దేశవ్యాప్తంగా విమానాల్ని నడుపుతున్న ఇతర విమానయాన సంస్థల ప్రయాణీకులకు ఎందుకు సమస్య రాలేదు.? ఇండిగో మాత్రమే ఎందుకు తమ ప్రయాణీకులకు నరకాన్ని చూపిస్తోంది.
ఎందుకంటే, ఇండిగో సంస్థనే ఎక్కువగా ఇబ్బంది పడింది.. కేంద్రం తెచ్చిన తాజా నిబంధనల నేపథ్యంలో.. అన్నది ఓ వాదన.!
Indigo Airline Crisis.. ఇదో దిక్కుమాలిన రాజకీయం..
మధ్యలో పౌర విమాన విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
‘సమస్యను సరిదిద్దడం చేతకాకపోతే, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చెయ్?’ అంటూ, సొంత పార్టీ టీడీపీలోనే ఆయనకు వ్యతిరేకత ఎదురవుతోంది.
సరే, అది రాజకీయ కోణం. అది వేరే చర్చ. కానీ, ప్రయాణీకుల వెతలకు బాధ్యత ఎవరు తీసుకోవాలి.? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది.? డీజీసీఏ ఏం చేస్తోంది.?
ఇండిగో విమానాల రద్దుతో రైళ్ళకు డిమాండ్ పెరిగింది. అదనపు రైళ్ళను రైల్వే శాఖ సమకూరుస్తోంది. అదనపు బస్సుల్నీ ఏర్పాటు చేస్తున్నాయి ఆయా రాష్ట్రాలు.
అయినాగానీ, విమాన ప్రయాణానికి సాటి రావు కదా రైలు ప్రయాణం అయినా, బస్సు ప్రయాణమైనా, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణమైనా.?
సమస్య కొద్ది రోజుల్లో సమసిపోవచ్చు. కానీ, మళ్ళీ ఇలాంటి సమస్య వస్తేనో.? నిజానికి, విమాన ప్రయాణానికి సామాన్యులు కూడా అలవాటు పడిపోయారు.
సో, ముందు ముందు ఏ చిన్న సమస్య వచ్చినా, ఆ సమస్య అత్యంత తీవ్రమైన పరిణామాలకు దారి తీయొచ్చు. విమాన యాన రంగానికి సంబంధించి ప్రక్షాళనకు ఇదే సరైన సమయం.
ప్రక్షాళన జరుగుతుందా.? వేచి చూడాల్సిందే.!
