Table of Contents
INS Androth Cost.. భారత నావికాదళం, సరికొత్త యుద్ధ నౌకని సమకూర్చుకుంది. దాని పేరు, INS Androth.
‘లక్ష ద్వీప్’లో ఓ ఐలాండ్ పేరు ‘ఆండ్రోత్’.! దీన్నే, యుద్ధ నౌకకి పెట్టారు.! యాంటీ సబ్‌మెరైన్ వార్ ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఇది.
అర్నాలా క్లాస్ యుద్ధ నౌకల్లో ఇప్పటికే INS Arnala భారత నౌకాదళంలోకి చేరిపోయి, సేవలు అందిస్తోంది. తాజాగా, INS Androth యుద్ధ నౌకని, ‘కమిషన్’ చేశారు.!
ఈ క్లాస్‌లో మొత్తం, 16 యుద్ధ నౌకలు, భారత నౌకాదళంలోకి చేరబోతున్నాయి. అవన్నీ, భారత నావికాదళానికి అదనపు బలాన్నివ్వనున్నాయి.
సముద్ర జలాల్లో శతృవుపై భారత నావికా దళానికి తిరుగులేని శక్తి ఈ తరహా యుద్ధ నౌకల ద్వారా లభిస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
INS Androth Cost.. ఓ సినిమా ఖర్చు.. అంతే.!
ఈ మధ్య ఏదన్నా పెద్ద సినిమా వస్తోందంటే, ‘వెయ్యి కోట్ల వసూళ్ళు’ అనే మాట వింటున్నాం. ప్యాన్ ఇండియా సినిమాల గురించిన చర్చ ఇది.
అలాంటిది, వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో, దేశాన్ని రక్షించే అత్యాధునిక యుద్ధ నౌకని తయారు చేసుకోగలమంటే నమ్మగలమా.?

INS Androth తయారీ ఖర్చు కేవలం 789 కోట్లు మాత్రమే. అంటే, పూర్తిగా 800 కోట్లు కూడా కాదు.
అంటే, వెయ్యి కోట్ల వసూళ్ళు సాధించే సినిమా కంటే, తక్కువ ఖర్చు అన్నమాట.. Arnala Class యుద్ధ నౌకల తయారీ కోసం వినియోగించేది.
నావికాదళం.. అత్యద్భుతమైన ప్రగతి సాధిస్తోంది..
మొన్నటికి మొన్న ఆపరేషన్ సిందూర్‌లో, భారత నౌకాదళం పోషించిన పాత్ర గురించి ప్రపంచమంతా కొనియాడుతున్న సంగతి తెలిసిందే.
సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ మోహరిస్తే, గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తా చాటితే.. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి.. దిశా నిర్దేశం చేసింది ఇండియన్ నేవీ.
భారత నౌకాదళానికి సంబంధించిన యుద్ధ నౌకలు, ఇండియన్ ఆర్మీనీ అలానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌నీ సమన్వయం చేశాయి.
తోక జాడించి వుంటే..
ఓ దశలో, పాపిస్తాన్ పోర్టులన్నీ భారత నౌకాదళం రాడార్ కిందకి వచ్చేశాయి. ఏమాత్రం తోక జాడించినా, పాపిస్తాన్ కథని ఆరోజే ముగించేసి వుండేది భారత నౌకాదళం.
Also Read: బంగారమ్.. భారతమ్.! 25 వేల టన్నుల గోల్డ్.. మనదే.!
న్యూక్లియర్ సబ్మెరైన్లు, డీజిల్ సబ్మెరైన్లు, స్టెల్త్ యుద్ధ నౌకలు.. వాట్ నాట్, భారత నౌకాదళం అమ్ములపొదిలో తిరుగులేని ఆయుధ వ్యవస్థ వుంది.
ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా, ఇవన్నీ స్వదేశీ తయారీనే కావడం గమనార్హం.
ఏడుగురు ఆఫీసర్లు, 50 మంది సెయిలర్స్ ఆండ్రోత్లో వుంటారు. బరువు సుమారు 900 టన్నులు. గంటకి 25 నాటికల్ మైళ్ళ వేగంతో.. అంటే, గంటకి 45 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది.
ఐఎన్ఎస్ ఆండ్రోత్ రేంజ్ 3300 కిలోమీటర్లు. రాకెట్ లాంఛర్ సహా, టార్పెడోల్ని సంధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి ఈ యుద్ద నౌకలో.
శతృ దేశాల సబ్మెరైన్లను ధ్వంసం చేసే మైన్స్ ఈ యుద్ధ నౌకలో వుంటాయి. భారత నౌకాదళంలో వాటర్ జెట్ పవర్డ్ వెజెల్స్ కేటగిరీలో ఇదే అతి పెద్ద యుద్ధ నౌక.
