INSV Kaundinya.. ఒక్కటంటే ఒక్క ఇనుప మేకు కూడా వాడకుండానే, పేద్ద పడవ తయారు చేసేశారు. దాని పేరు కౌండిన్య.!
అత్యాధునిక యుద్ధ నౌకల్ని అమ్ముల పొదిలో కలిగి వున్న ఇండియన్ నేవీకి చెందినదే ఈ కౌండిన్య కూడా.! కాకపోతే, దీన్ని యుద్ధాల కోసం తయారు చేయలేదు.
వందల ఏళ్ళ క్రితం, నౌకాయానం ఎలా జరిగింది.? ఆనాటి నౌకా నిర్మాణం ఎలా వుండేది.? వంటి అంశాల గురించి నేటి తరానికీ, రాబోయే తరాలకీ చాటి చెప్పేందుకే ఈ ప్రయత్నం చేశారు.

పేరు ‘ఐఎన్ఎస్వీ కౌండిన్య’.! దీన్ని, గుజరాత్ నుంచి గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు. కౌండిన్యకి, మోటారు కూడా లేదు.! కేవలం, గాలి తెరల ఆధారంగా సముద్రంలో పయనిస్తుందంతే.
సెయిలర్స్.. అదే, నావికుల భద్రత కోసం కొన్ని అత్యాధునిక పరికరాలు ఇందులో ఏర్పాటు చేశారు. అవి తప్ప, నౌకా నిర్మాణం అంతా సంప్రదాయ పద్ధతుల్లోనే జరిగింది.

చెక్కని వినియోగించారు.. ఓ రకమైన గమ్ వాడారు.. ఆ గమ్ కూడా, సంప్రదాయ పద్ధతిలోనే తయారు చేశారు. కొబ్బరి పీచు సాయంతో, ‘కుట్లు’ వేశారు కౌండిన్య కోసం.
స్టిచ్చింగ్ మెథడ్ ఆధారంగా ఐఎన్ఎస్వి కౌండిన్య నౌక నిర్మాణం జరిగింది.
పురాతన కాంలో నౌకా నిర్మాణానికి సంబంధించి, అందుబాటులో వున్న చారిత్రక కథనాలు, చిత్రాలను ఆధారంగా చేసుకుని, కౌండిన్య నిర్మాణాన్ని పూర్తి చేయడం గమనార్హం.
