Ivana Single Actress.. టాలీవుడ్‌కి ఎప్పటికప్పుడే కొత్త కొత్త ముద్దుగుమ్మలు పరిచయమవుతూ వుంటారు. తమదైన స్పెషల్ టాలెంట్‌తో కొందరు ముద్దుగుమ్మలు సక్సెస్ అయ్యి స్టార్‌డమ్ సంపాదించుకుంటారు.
కొందరు అన్నీ వున్నా లక్కు కలిసి రాక రేస్‌లో వెనకబడిపోతుంటారు. ఇంకొందరు ఒక్క సినిమాకే పరిమితమైపోతుంటారు. తాజాగా మరో కొత్త భామ టాలీవుడ్‌కి పరిచయం కాబోతోంది.
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ‘సింగిల్’ మూవీ ఈ మధ్య ట్రెండింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
మొన్నా మధ్య రిలీజ్ చేసిన టీజర్‌లోని ఓ డైలాగ్ ఒకింత వివాదాస్పదమై, ఈ సినిమా పేరు మరింత వైరల్ అయిన సంగతి కూడా తెలిసిందే.
Ivana Single Actress.. కొత్తా భామఅండీ.! సరికొత్తా అందమండీ.!
ఆ సంగతి అటుంచితే, ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. అందులో కేతిక శర్మ ఆల్రెడీ సుపరిచితురాలే. మరో ముద్దుగుమ్మ ఇవానా.
ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. గతంలో ‘లవ్ టుడే’ అనే ఓ తమిళ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని తెలుగులోనూ డబ్ చేశారు.

అప్పట్లో ఈ సినిమా ఓ ట్రెండింగ్ అనే చెప్పాలి. యూత్‌లో సెన్సేషన్ అయ్యిందీ సినిమా. అలా ఇవానా కొంతమంది తెలుగు ప్రేక్షకులకి పరిచయమే.
బ్యూటీ విత్ టాలెంట్
ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్‌గా చేస్తున్న సినిమా ‘హ్యాష్ టాగ్ సింగిల్’. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ప్రమోషన్ల పేరు చెప్పి, ఇవానా చాలానే సందడి చేస్తోంది.
అన్నట్లు, సోషల్ మీడియాలోనూ ఇవానా పాప బోలెడంత ట్రెండింగ్. రీల్స్, ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటోంది. మంచి టాలెంట్ వున్న బ్యూటీనే.
Also Read: పాపిస్తాన్ నటుడిపై ‘ప్రకాష్ రాజ్ పాపిష్టి ప్రేమ’ ఏమిటో.!
టాలెంటూ, గ్లామర్‌తో పాటూ, ట్రెడిషనల్ లుక్స్‌లోనూ ఫిట్ అండ్ పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తోంది. సో, లక్కు కలిసొస్తే.. తెలుగులో నిలదొక్కుకోవడం ఖాయమే. చూడాలి మరి.!
ఆల్ ది బెస్ట్ ఇవానా.!