Table of Contents
Jabardast ETV Mallemala జబర్దస్త్.. జస్ట్ ఓ కామెడీ స్కిట్స్‌తో కూడిన ప్రోగ్రామ్ మాత్రమే కాదు.! అంతకు మించి.!
తెలుగు బుల్లితెరపై ఇదో సరికొత్త ప్రయోగం. ఏళ్ళ తరబడి ఓ ప్రోగ్రామ్‌ని.. అందునా ఓ కామెడీ ప్రోగ్రామ్‌ని కొనసాగించడమంటే చిన్న విషయం కాదు.
ఈ విషయంలో ముందుగా ఈటీవీనీ, మల్లెమాల సంస్థనీ అభినందించి తీరాలి.
జడ్జిలుగా వ్యవహరించిన రోజా, నాగబాబు, మేనేజర్ ఏడుకొండలు, యాంకర్లు అనసూయ అలాగే రష్మి గౌతమ్, టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు, టెక్నీషియన్లు.. ఇలా ఎవరూ తక్కువ కాదు.!
అసలెందుకీ లొల్లి.?
మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన సినిమా, ఇంకో హీరో చేతికి వెళ్ళింది.. అని వింటుంటాం. సినిమా రంగంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. మరి, బోల్డంత కమెడియన్లతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ నుంచి జంపింగులు వుండవా.?
ఎవరో ఎవర్నో వెన్నపోటు పొడిచారంటూ కమెడియన్లే సాటి కమెడియన్ల మీద సెటైర్లేసుకున్న స్కిట్లు చాలా చూశాం. అవీ సూపర్ హిట్టయ్యాయి.

మనసులో మాట.. అంటూ కామెడీ చేస్తూనే, అందులో వున్న ‘రాజకీయాల్ని’ బయటపెట్టేసుకున్నారు కమెడియన్లు. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా పెద్ద కథే నడిచింది.
Jabardast ETV Mallemala.. వెళ్ళారు.. మళ్ళొచ్చారు.!
పలువురు కంటెస్టెంట్లు జబర్దస్త్ వదిలేసి బయటకు వెళ్ళారు.. అందులో కొందరు తిరిగొచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. కాలక్రమంలో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్.. రెండూ పేలవరంగా తయారయ్యాయి.
ఇంకోపక్క, వివిధ ఛానళ్ళు ఇదే ఫార్మాట్‌లో పలు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా చేతులెత్తేయక తప్పలేదు. నాగబాబు వున్నా, జబర్దస్త్ కమెడియన్లే ఆయా స్కిట్లలో కనిపించినా.. వేరే ఛానళ్ళలో ఆయా కార్యక్రమాలు వర్కవుట్ అవని పరిస్థితి.
ఎందుకీ లొల్లి.?
కిర్రాక్ ఆర్పీ ఓ యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో జబర్దస్త్‌ని నానా రకాలుగా తిట్టాడు. మల్లెమాల సంస్థపైనా మండిపడ్డాడు. ఆ సంస్థ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డినీ తూలనాడాడు.
ఆర్పీ విమర్శలకి కౌంటర్ ఎటాక్ కూడా వచ్చింది. ఎందుకిదంతా.? అంటే, ఇదో టైపు పబ్లిసిటీ స్టంట్.. అనేవారూ లేకపోలేదు.
Also Read: డాక్టరూ.. యాక్టరూ.. సాయిపల్లవి ‘రెమ్యునరేషన్’ సూపరూ.!
మొత్తంగా చూస్తే.. ఈ లొల్లి వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. కానీ, ఖాళీగా వుండేవాళ్ళకి ఈ లొల్లి సూపర్బ్ టైమ్ పాస్ అంతే. ఇది కూడా జబర్దస్త్ స్కిట్ అనుకోవాల్సిందేనేమో.!
ఒక్కటి మాత్రం నిజం.. జబర్దస్త్ అయినా ఎక్స్‌ట్రా జబర్దస్త్ అయినా ఒకప్పుడు బోల్డంత రిలాక్సేషన్. హాయిగా నవ్వుకునేందుకు తగినంత స్టఫ్ అక్కడ దొరికేది. ఇప్పుడా పరిస్థితి లేదు.