Jagan Dirty Politics Against Pawan.. 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికార పక్షం హోదాలో ‘సిద్ధం’ పేరుతో బహిరంగ సభల్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఆ ‘సిద్ధం’ సభల్లో జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని పోలిన మస్కట్లు (బొమ్మలు) తయారు చేయించి, పక్కనే బాక్సింగ్ గ్లౌస్ వుంచి, వైసీపీ కార్యకర్తలతో వాటిని కొట్టించారు.
రాజకీయాల్లో విమర్శలు సహజం.! రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే వుంటారు. కానీ, రాజకీయ ప్రత్యర్థుల్ని శతృవుల్లా మార్చేసుకున్నారు వైఎస్ జగన్.
కార్యకర్తలంటే, ఉన్మాదులు.. అన్న కోణంలో, వైసీపీ కార్యకర్తల్ని ఉన్మాదులుగా మార్చిన ఘన చరిత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.
Jagan Dirty Politics Against Pawan.. అధికారం కోల్పోయినా బుద్ధి రాలేదు..
2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని విజయాన్ని అందుకున్న అధికార పీఠమెక్కిన వైసీపీ, 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోవడానికి కారణమేంటో, వైఎస్ జగన్ ఆత్మవిమర్శ చేసుకోలేదు.
పవన్ కళ్యాణ్ మీద ‘ప్యాకేజీ స్టార్’ అంటూ ఆరోపణలు చేయడం, వైసీపీ నేతలతో పవన్ కళ్యాణ్‌ని బూతులు తిట్టించడం.. ఇవన్నీ వైసీపీ కొంప ముంచాయి.

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా, చివరికి పవన్ కళ్యాణ్ జీవిత భాగస్వామిపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలు. ఇవన్నీ, వైసీపీని సర్వనాశనం చేశాయి.
అయినా, వైసీపీలో మార్పు లేదు. ఇంకా అదే పైత్యం వైసీపీ ప్రదర్శిస్తూ వస్తోంది. పైన ఫొటో చూస్తున్నారు కదా.. వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లోనే ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు.
ప్రశ్నించడం తప్పు కాదు గానీ..
ప్రతిపక్ష హోదా లేకపోయినా, ప్రభుత్వాన్ని వైసీపీ ప్రశ్నించొచ్చు. ప్రశ్నించాలి కూడా. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతల్లో వున్నారు గనుక, ఆయన్ని నిలదీయొచ్చు.

కానీ, నిలదీయడానికీ.. ప్రశ్నించడానికీ.. ఓ పద్ధతి వుంటుంది. ఇలా మార్ఫింగ్, ఫేక్ ఫొటోలతో వైసీపీ చేసే దుష్ప్రచారం, వైసీపీ కొంప ముంచుతుందన్నది నిర్వివాదాంశం.
Also Read: జై చిరంజీవ.! నీ నామ జపమే వాళ్ళకి బతుకుదెరువు.!
ఔను, వైఎస్సార్సీపీకి వేరే శతృవులు అక్కర్లేదు. ఇలాంటి ఉన్మాదమే వైసీపీకి అసలు సిసలు శతృవు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. గమనించే, వైసీపీని పాతాళానికి తొక్కేశారు.
ఇంతకన్నా దారుణమైన ఓటమి ఏముంటుంది.? అని వైసీపీ అనుకోవచ్చుగాక.! ప్రజలు తలచుకుంటే, వైసీపీ.. శాశ్వతంగా ఏపీ రాజకీయాల్లోంచి ఔట్ అయిపోతుంది.
