Jana Sena Kukatpally Victory.. అనూహ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రేసులోకి దూసుకొచ్చింది జనసేన పార్టీ.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టి, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయదన్న చర్చ జరిగినా.. తెగించి, జనసేన పార్టీ బరిలోకి దిగింది.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. తెలుగుదేశం వంటి ‘సీనియర్ పార్టీ’, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నా, జనసేన మాత్రం తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధమైంది.
అనూహ్యంగా మారిన ఈక్వేషన్..
సింగిల్‌గా 32 సీట్లలో పోటీ చేయాలనుకున్న జనసేన, బీజేపీతో పొత్తు కారణంగా 8 సీట్లలో పోటీ చేయడంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కూకట్‌పల్లి లాంటి కీలక నియోజకవర్గాల్ని పొత్తులో భాగంగా దక్కించుకున్న జనసేన, ఎన్నింటిలో గెలుస్తుందన్నది ఫలితాల రోజు తెలుస్తుంది.
అయితే, జనసేనకు తెలంగాణలో డిపాజిట్లు రావడమే కష్టమంటూ రాజకీయ ప్రత్యర్థుల నుంచి సెటైర్లు పడుతున్న వేళ, ఇదీ జనసేన సత్తా.. అంటూ, ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది ‘గ్లాసు’ పార్టీ.!
కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన అభ్యర్థి, బీజేపీ నుంచి టిక్కెట్ ఆశించారు. కానీ, అనూహ్యంగా ఆయన జనసేనలోకి వచ్చి, జనసేన నుంచి టిక్కెట్ దక్కించుకున్నారు. దాంతో, బీజేపీ శ్రేణులూ ఆయనకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాయి. జనసేన – బీజేపీ పొత్తు, కూకట్‌పల్లిలో పొలిటికల్ ఈక్వేషన్స్‌ని అనూహ్యంగా మార్చేసింది.
Mudra369
ప్రధానంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో అనూహ్యంగా పుంజుకుంది. బీజేపీ మద్దతుతో మొత్తం 8 నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీ టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్‌గా మారడం గమనార్హం.
Jana Sena Kukatpally Victory.. టీడీపీ మద్దతు లేకున్నా..
నిజానికి, సెటిలర్స్ (ఈ పదం ఉపయోగించడం ఎంతవరకు సబబు.? అన్నది వేచే చర్చ.! కానీ, వాడుకలో వున్న పదమే ఇది) ఎక్కువగా వున్న ప్రాంతం కూకట్‌పల్లి. ఈ నియోజకవర్గంలో జనసేనకి టీడీపీ మద్దతు అస్సలు కనిపించడంలేదు.
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ క్యాడర్ మద్దతిస్తోంది. ఏపీలో టీడీపీ – జనసేన మధ్య పొత్తు వున్నా, తెలంగాణలో జనసేన వైపు టీడీపీ క్యాడర్ మళ్ళకపోవడం ఆశ్చర్యకరం.
కాగా, నిన్నటి కూకట్‌పల్లి జనసేనాని బహిరంగ సభతో, ఈ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయమనీ, జనసేన అభ్యర్థికి బంపర్ మెజార్టీ దక్కుతుందనీ రాజకీయ వర్గాల్లో చర్చ షురూ అయ్యింది.
Also Read: మెగా కుటుంబం.! సరిపోతుందా ఈ సమాధానం.?
తెలంగాణలో పోటీ చేస్తున్న 8 నియోజకవర్గాల్లో ఒకటి రెండు నియోజకవర్గాల్లో జనసేన గెలిచినా, ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై గట్టిగానే వుండబోతోంది.
అదే, ఓ నాలుగైదు సీట్లలో జనసేన గెలిచి, తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెడితే, ఆంద్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలు జనసేన కోణంలో అనేక సంచలనాలకు కారణమవ్వొచ్చు.!
కొడుతున్నాం.. కూకట్‌పల్లిలోనే కాదు, మిగతా నియోజకవర్గాల్లోనూ.! తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోనూ.! ఇదీ జనసేన ధీమా.!