Table of Contents
Janasena Kapu Vote Bank.. రాజకీయాల్లో కులాల, మతాల, ప్రాంతాల ప్రస్తావన లేకుండా వీలుపడని పరిస్థితి.!
ఒకప్పుడైతే ఫలానా సామాజిక వర్గం.. అని మీడియా పేర్కొనేది. ఇప్పుడు స్పష్టంగా ఆ కుల ప్రస్తావన తీసుకొస్తోంది. అలా మారింది రాజకీయం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra Pradesh Capital) అమరావతికి ‘కమ్మ’రావతి అని నామకరణం చేసిన నీఛ నికృష్ట రాజకీయం రాజ్యమేలుతున్న రోజులివి.
ఇంతకీ ఎవరిది ఈ పాపం.! అందరిదీ.! తిలా పాపం తలా పిడికెడు.. అన్న చందాన, రాష్ట్రమిలా తగలడటానికి అందరూ కారకులే.. ప్రజలతో సహా.!
Jana Sena Paty Kapu.. ‘కాపు’ కాసేదెలా.?
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పు కనిపిస్తోంది. అయితే, ఆ ‘మార్పు’ జనసేన పార్టీకి అధికారమిస్తుందా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.
‘కమ్మటి’ రాజకీయాన్ని చూశాం.. రెడ్డి రాజకీయాన్నీ చూశాం.! ఈసారి ‘కాపు’ కాద్దాం.. అంటున్నారు జనసేన వైపు చూస్తోన్న చాలామంది.

‘కాపు’ కాయడమంటే, కాపు సామాజిక వర్గం మొత్తం జనసేన పార్టీకి (Jana Sena Party) అండగా వుంటుందా.? అన్న చర్చ గురించి కాదు.!
సరికొత్త ఆలోచనలతో, రాజకీయ అవినీతికి తావు లేకుండా.. మంచి పాలన అందిస్తామని చెబుతోంది జనసేన పార్టీ (Jana Sena Party).
Janasena Kapu Vote Bank.. ఒక్క ఛాన్స్.. సాధ్యమయ్యే పనేనా.?
ఒకే ఒక్క ఛాన్స్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని (Andhra Pradesh State Capital) దూరం చేసింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీ నుంచి అధికార పక్షమే వెనక్కి తీసుకున్నా, రాష్ట్రానికి మూడు రాజధానులనే భ్రమల్లో వున్నారు వైసీపీ క్యాడర్. వాళ్ళని అంతలా భ్రమల్లో ముంచేసింది వైసీపీ.

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే, రాష్ట్రానికి రాజధాని అనేది వుంటుంది. లేదంటే, మళ్ళీ గందరగోళమే.!
కానీ, తిరిగి చంద్రబాబుకి (Telugu Desam Party Chief Nara Chandrababu Naidu) రాష్ట్ర ప్రజలు అధికారమిస్తారా.? అంటే, దానిపైనా భిన్నాభిప్రాయాలున్నాయి.
కేవలం.! ఇది ఏ రాజకీయ పార్టీకీ సాధ్యం కాని వైనం.!
కేవలం ‘కాపు’ ఓట్లు పడితే, జనసేన పార్టీకి అధికారం వచ్చేయదు. కేవలం రెడ్డి ఓట్లతో వైసీపీగానీ, కేవలం కమ్మ ఓట్లతో టీడీపీగానీ.. అధికారంలోకి రావడమనేది జరగలేదు.
మార్పుకి ‘కాపు’ కాయాల్సి వుంటుంది రాష్ట్ర ప్రజలు. అప్పుడే, జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ దిశగా ఇప్పటికే ప్రజల్లో చైతన్యం వచ్చినట్లు గ్రౌండ్ రియాల్టీ బట్టి అర్థమవుతోంది.
Also Read: ‘భోళా శంకర్’పై కుట్ర.! ఎద్దు ఈనిందిరోయ్.!
కానీ, ఎన్నికలంటేనే.. ఓటు బ్యాంకు రాజకీయం. బూత్ లెవల్‌లో చేసే ఖర్చు సహా చాలా అంశాలు, ఎన్నికల్లో గెలుపోటముల్ని శాసిస్తాయ్. మరి, అలా శాసించే మెకానిజం వైపు జనసేన ఆలోచన చేస్తుందా.? వేచి చూడాల్సిందే.
ఒక్కటి మాత్రం నిజం.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అన్న కోణంలో ముఖ్యమంత్రి పదవి విషయమై కాపు సామాజిక వర్గంలో చైతన్యం వస్తోంది. అది జనసేనకు కొంతమేర అనుకూలించే అవకశం లేకపోలేదు.