Janasenani Pawan Kalyan Janasainyam.. ఆయనో జనసైనికుడు.! అంటే, కేవలం జనసేన పార్టీ కార్యకర్తే కాదు.! నిజానికి, జనసేన పార్టీకి కార్యకర్త కూడా కాదు. పవన్ కళ్యాణ్ అభిమాని.!
పవన్ కళ్యాణ్ అభిమానులంతా నిజానికి జనసైనికులు కాదు.! చాలామందికి జనసేన పార్టీ సభ్యత్వం లేదు.! కానీ, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జనసేనాని అయ్యారో, ఆయన అభిమానులంతా దాదాపుగా ‘జనసైనికులు’గా మారిపోయారు.. అధికారికంగానో, అనధికారికంగానో.!
టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించబడ్డంతో, జనసైనికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
Janasenani Pawan Kalyan Janasainyam.. మాటలు తూలారు..
కొందరు జనసైనికులు బోర్డర్ దాటేసి, పవన్ కళ్యాణ్ మీద కూడా మాటలు తూలారు. అయితే, ఇదంతా జస్ట్ ఇరవై నాలుగ్గంటల ఆవేదన మాత్రమే.
మరుసటిరోజుకి ఆత్మవిమర్శ మొదలైంది. ఇప్పుడున్న రాజకీయాల్లో, పవన్ కళ్యాణ్‌లా నిజాయితీగా ప్రజల కోసం నిలబడే నాయకుడెవరున్నారు.? అని ప్రశ్నించుకుంటే, వాళ్ళకి ఏ ఆప్షన్ కనిపించలేదు.

దాంతో, ‘క్షమించండి కళ్యాణ్ గారూ..’ అంటూ, తిరిగి, జనసేన యాక్టివిటీస్‌లో బిజీ అయిపోయారు. వీళ్ళలో చాలామంది కేవలం సోషల్ మీడియాకే పరిమితమయ్యేవాళ్ళున్నారు.
‘మేం చేయగలిగేది సోషల్ మీడియా వేదికగా పది మందిని జనసేనకు అనుకూలంగా మార్చడం. మేం చేయగలిగింది, జనసేనకు ఆర్థికంగా మా వంతు సహకారం అందించగలగడం..’ అని పేర్కొంటూ తమ తమ పనుల్లో బిజీ అయ్యారు.
సైన్యం ఆవేదన సేనానికి చేరేదెలా.?
చేసిన విమర్శకు పరిహారంగా.. అన్నట్టు, చాలామంది జనసేన పార్టీకి తమకు తోచిన రీతిలో విరాళాలు అందిస్తున్నారు.
వాస్తవానికి, వీళ్ళందరికీ వున్న సమస్య ఏంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తమ ఆవేదన వెళుతోందో లేదోనని.! ఓ ఛానల్, ఇలాంటివారికి ఖచ్చితంగా వుండాలి, పవన్ కళ్యాణ్‌ని చేరుకునేందుకు.
Also Read: ది గ్రేట్ గాసిప్! రేయ్ యెంకటీ! నీ ‘రెడ్’ లైట్ కుంపటి కథేంటి?
ప్రత్యక్షంగా అంటే కష్టం కావొచ్చు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి అభిమానులతో కనెక్ట్ అవడం పవన్ కళ్యాణ్‌కి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.