Janasenani Pawan Kalyan Jnanodayam జనాన్ని దోచెయ్యడమే నేటి రాజకీయం.. అనుకుంటున్నారు చాలామంది.! రాజకీయ నాయకులు ఇలా అనుకుంటే తప్పు లేదు.!
ప్రజాస్వామ్యానికి మూల స్థంబాల్లో ఒకటని చెప్పుకునే ‘ఫోర్త్ ఎస్టేట్’ కూడా అలాగే దిగజారిపోతోంది.!
మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్.. ఫోర్త్ పిల్లర్.. అని చెప్పుకుంటూ, మీడియా రంగాన్ని సర్వనాశనం చేస్తున్నారు కొందరు.
కుల జాడ్యం మీడియాని నాశనం చేస్తోంది.! ఆ కుల జాడ్యమే మీడియాని శాసిస్తోంది. సో, మీడియా నుంచి, రాజకీయ పైత్యం కాక ఇంకేం ఆశించగలం.?
Janasenani Pawan Kalyan Jnanodayam.. జనసేనానికి జ్ఞానోదయమట.!
జ్ఞానోదయం అంటే ఏంటి.? రాజకీయ నాయకుడికి ఎలాంటి జ్ఞానోదయం కలగాలి.? సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి, ప్రజల్ని దోచుకోకూడదన్నది మూల సూత్రం.!
దురదృష్టం.. జనాన్ని దోచుకుంటే తప్ప, రాజకీయాల్లో రాణించలేం.. అన్న భావనలో రాజకీయ నాయకులున్నారు. అలాంటోళ్ళ ఎంగిలిమెతుకులకు మీడియాలో మెజార్టీ ఆశపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సేవ కోసం.! ప్రజల్లో మార్పు కోసం. వ్యవస్థ బాగు కోసం.! రాజకీయాలు వద్దనుకుంటే, పవన్ కళ్యాణ్‌కి సినిమా రంగం వుంది.
సినిమాల్లో కోట్ల సంపాదన వదులుకుని, రాజకీయాల్లోకి వచ్చారంటే.. పవన్ కళ్యాణ్‌కి అక్కడ కొత్తగా జ్ఞానోదయం అయ్యేదేముంటుంది.?
పాఠాలు నేర్చుకోవడమంటే ఏంటో.!
2019 ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకోవడం.. అంటే, ఆయనేమీ నేరాలు ఘోరాలూ చేసెయ్యలేదే.! డబ్బులు పంచలేదు. పార్టీలో ఎవరూ పంచడానికి వీల్లేదని హుకూం జారీ చేశారు.
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
సో, ఇక్కడ జ్ఞానోదయం అంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేనాని కూడా ఫక్తు రాజకీయ నాయకుడిలా మారిపోవాలని, మీడియాలో మెజార్టీ వర్గం కోరుకుంటోందన్నమాట.
ఔను మరి, ప్రకటనల రూపంలో ఎంగిలిమెతుకులు తమ బొచ్చెలో పడుతున్నప్పుడు.. మీడియా ఇలా కాక ఇంకెలా ఆలోచిస్తుంది.?

నేటి పాత్రికేయం.. ప్రజల కోసం కాదు.! ఇదొక వ్యాపారం.! దీనికంటే వ్యభిచారం చాలా మేలు కదా.. అనే స్థాయికి పాత్రికేయం తనను తాను దిగజార్చేసుకుంది.!