Janasenani Vizag Varahi Yatra.. పచ్చడి తాళింపు.. పులిహోర తాళింపు.. ఇలాంటి తాళింపుల గురించి విన్నాంగానీ.. కరెన్సీ కట్టల తాళింపు ఏంటి.?
రాజకీయాల్లో విమర్శలు చిత్ర విచిత్రంగా కనిపిస్తుంటాయ్.. వినిపిస్తుంటాయ్.! ఎప్పటికప్పుడు ట్రెండీగా విమర్శలు చేయడం.. ఇదో నయా ట్రెండ్.!
అసలు విషయంలోకి వస్తే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Jana Senani Pawan Kalyan), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సెటైర్లేశారు.
ఎంత తింటావు జగన్.? కరెన్సీ కట్టల్ని తాళింపు వేసి ఇస్తా.. తింటావా.? అంటూ విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన వారాహి విజయ యాత్రలో ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
Janasenani Vizag Varahi Yatra.. విమర్శల్లో కొత్త పంథా..
ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. రాజకీయ అవినీతిని ప్రశ్నించే క్రమంలో జనసేనాని ఎత్తుకున్న కొత్త పంథా అంతటా చర్చనీయాంశమయ్యింది.

గడచిన నాలుగేళ్ళలో వైసీపీ, రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా చేయలేదనీ, అవినీతి అక్రమాలతో ప్రజల్ని వేధిస్తోందనీ, రాష్ట్రాన్ని దోచుకుంటోందని జనసేనాని విమర్శిస్తున్నారు.
కాగా, విశాఖలో వారాహి విజయ యాత్రకు (Vizag Varahi Vijaya Yatra Pawan Kalyan) పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. అయినా, జన సంద్రం పోటెత్తింది.
జనసంద్రం..
విశాఖ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ స్థాయి జనసంద్రాన్ని చూసి విశాఖ వాసులే కాదు, యావత్ రాష్ట్రం ఆశ్చర్యపోతోంది.
జనం స్వచ్ఛందంగా తరలి రావడం అనేది కేవలం జనసేన పార్టీకి (Jana Sena Party) సంబంధించిన కార్యక్రమాల్లోనే కనిపిస్తోంది.
Also Read: క్రిమినల్ థియరీ! ‘పద్మభూషణ్’ చిరంజీవికెందుకు రాజకీయం?
విశాఖలో రౌడీయిజం రాజ్యమేలుతోందనీ, కొండల్ని సైతం అధికార పార్టీ దోచేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) విమర్శించారు.
‘మేం అధికారంలోకి వస్తే.. విశాఖను (Visakhapatnam Varahi Vijaya Yatra) మళ్ళీ ప్రశాంత నగరంగా మార్చుతాం..’ అని నినదించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
‘వారాహి విజయ యాత్రలో’ (Varahi Vijaya Yatra) యువతతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు కూడా పాల్గొంటున్నారు.. అదీ స్వచ్ఛందంగా.!