Janhvi Kapoor.. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. వాస్తవానికి తన కుమార్తెను తెలుగు సినీ పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయం చేయాలనుకుంది శ్రీదేవి.
కానీ, శ్రీదేవి అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. బాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమై, ఆ బాలీవుడ్‌లో మాత్రమే ప్రస్తుతానికి జాన్వీ కపూర్ సినిమాలు చేస్తోంది.
సౌత్ సినిమా పిలుస్తున్నా, జాన్వీ కపూర్‌కి తగిన సమయం దొరకడంలేదు. ‘సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుగు సినిమాల్లో నటిస్తా.. సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించాలని వుంది..’ అని చెబుతుంటుంది జాన్వీ.
Janhvi Kapoor.. మాటలు సరే.. చేతలేవీ.?
చెప్పడానికేం.. జాన్వీ కపూర్ చాలా మాటలే చెబుతుంటుంది. మహా మాటకారి మరి.!
సోషల్ మీడియాలో హాట్ అండ్ వైల్డ్ ఫొటోలు ఎందుకు.? అంటే, వాటి ద్వారా వచ్చే డబ్బుతో ఈఎంఐలు కట్టుకోవాలి.. అని జాన్వీ సమాధానమిస్తుంటుంది.
తండ్రి వయసున్న హీరోలతో..
‘మా అమ్మ తన వయసు కంటే చాలా చాలా పెద్ద వయసున్న హీరోలతో నటించింది..’ అని చెప్పడం ద్వారా, సీనియర్ హీరోల సరసన కూడా సినిమాలు చేస్తానని జాన్వీ కపూర్ చెప్పకనే చెప్పేసింది.
Also Read: పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అన్‌స్టాపబుల్.! ఈ మొరుగుడేల.?
నిజమే, శ్రీదేవి చాలా చిన్న వయసులోనే చాలా చాలా పెద్ద వయసున్న హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించింది మరి.!
సో, జాన్వీ కపూర్ కూడా ముందు ముందు సీనియర్ హీరోలతో నటించే అవకాశం వుందన్నమాట. ‘అందులో తప్పేముంది..’ అని ఓ ప్రశ్నకు బదులిచ్చింది జాన్వీ కపూర్.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. జాన్వీ కపూర్ కథల ఎంపికలో జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. తొలి సినిమా ‘ధడక్’ నుంచి.. ప్రతి సినిమా విషయంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.

నటిగా తనను తాను మరింత పదును పెట్టుకునేలా జాన్వీ కపూర్ సినిమాల్ని ఎంచుకుంటున్న వైనాన్ని అభినందించి తీరాల్సిందే.
కాగా, జాన్వీ కపూర్‌ని నటిగా పరిచయం చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడే, ముందుగా మీడియాని ఎలా ఫేస్ చేయాలన్నదానిపై తల్లి శ్రీదేవి ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
దాని ఫలితమే.. జాన్వీ కపూర్ మాటకారితనేం.!