Jatadhara Review Just Dangerous.. సుధీర్‌బాబు విలక్షణమైన కథల్ని ఎంచుకుంటుంటాడు.!
అతను నటించిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయి వుండొచ్చు.. కానీ, సినిమా కోసం అతను పడే కష్టం మనకి కనిపిస్తుంటుంది.
మొట్టమొదటిసారిగా సుధీర్‌బాబు నటించిన ఓ సినిమాలో, అతనొక బొమ్మలా మిగిలిపోయాడు. సుధీర్‌బాబు మాత్రమే కాదు, సినిమాలో నటీనటులందరిదీ అదే పరిస్థితి.!
‘జటాధర’ పేరుతో పాన్-ఇండియా స్థాయిలో ఓ సినిమా ప్రచారం పొందింది. సోనాక్షి సిన్హా ఈ సినిమాలో ‘ధన పిశాచి’గా నటించింది.
ఓ ధన పిశాచి.. ఓ ఊరిని పీడిస్తుంటుంది.. ఘోస్ట్ హంటర్ మన హీరో.! మేటర్ అర్థమయ్యింది కదా.! దెయ్యాన్ని అంతం చేయాలి.! కానీ, అతడే ఆ దెయ్యం బాధితుడైతే.?
దటీజ్ జటాధర.! జటాధర అంటే శివుడు కదా.! సినిమాకీ, శివుడికీ ఏమైనా సంబంధం వుందా.? ఏం లేదు, సినిమా చివర్లో.. అష్ట లింగాల ప్రస్తావన వుంటుందంతే.
నిజానికి, ధన పిశాచి.. అనగానే, ఇంట్రెస్టింగ్ పాయింటే.. అనిపిస్తుంది. తగినంత కామెడీ జోడిస్తే, భలే కామెడీ థ్రిల్లర్ అయి వుండేది. పోనీ, సీరియస్ సినిమాగా డిజైన్ చేసుకున్నా బావుండేది.
సినిమాలో సీన్లు వచ్చి వెళుతుంటాయి.. దేనికీ, దేనితోనూ సంబంధం లేనట్లనిపిస్తుంది. అతుకుడు సమస్య. అంటే, ఎడిటింగ్ సరిగ్గా జరగలేదు.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలాంటి సినిమాలకు ప్రధాన ఆకర్షణ. కానీ, ఈ సినిమాకి పెద్ద మైనస్ ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమాటోగ్రఫీ కూడా అంతే.
ఒక్కటంటే ఒక్క విభాగం కూడా సినిమా కోసం మనసు పెట్టి పని చేయలేదంటే, అది అతిశయోక్తి కాదు. ఎవ్వరూ సినిమా కోసం ఇష్టంతో పని చెయ్యలేదు.
సోనాక్షి సిన్హా పాత్ర గురించి అసలు మాట్లాడుకోవడమే అనవసరం. అంత చెత్తలా వుంది ఆమె పోషించిన ధన పిశాచి రోల్.!
సినిమా కాదిది, చిల్లర వ్యవహారం అనిపిస్తుంటుంది సినిమా చూస్తున్నంతసేపూ.! సాధారణంగా ఎంత చెత్త సినిమా అయినా, అందులో ఒక్కటైనా మంచి సీన్ వుంటుంది.
కానీ, ‘జటాధర’ సినిమాలో ఒక్కటంటే ఒక్క సీన్ కూడా మంచిది వుండకూడదని ఒట్టేసుకున్నట్లున్నారు. అంత చెత్తగా తీశారు సీన్స్ అన్నీ.
సుధీర్‌బాబు అయితే, జస్ట్ బొమ్మలా మిగిలిపోయాడు. ఓ పాటలో డాన్స్ చేశాడుగానీ, అస్సలు సింక్ అవలేదు పాటకి. చెప్పుకుంటూ పోతే, ఇటీవలి కాలంలో ఇంత చెత్త సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదేమో.!
ఓటీటీలో ఫ్రీగా వచ్చింది కదా.. అని, ‘జటాధర’ సినిమా చూసే ప్రయత్నం చేసేరు.? అస్సలు ఆ రిస్క్ చెయ్యొద్దు.. సుధీర్‌బాబు మీద గౌరవం పోతుంది సినిమా చూస్తే.!
అసలు, సినిమా పూర్తయ్యాక సుధీర్‌బాబు చూసుకున్నాడా.? సీన్ జరిగాక, మానిటర్‌లో అయినా సుధీర్ ఎందుకు చూసుకోలేదు.? చాలా ప్రశ్నలున్నాయ్.!
ఇలాంటి ఔట్ పుట్ థియేటర్లలోకి వచ్చిందంటేనే, అదో వైపరీత్యం.! ప్రేక్షకులకి సినిమా అంటేనే అసహ్యమేసేలా ‘జటాధర’ సినిమాని ఓ పద్ధతి ప్రకారం తెరకెక్కించినట్లున్నారు.
