Jawan FDFS Review.. షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇది బాలీవుడ్ సినిమానా.? కాదు కాదు.. ఇండియన్ సినిమా. తమిళ సినీ ప్రేక్షకులు, దీన్ని తమిళ సినిమాగా చూస్తున్నారు.. ఎందుకంటే, దర్శకుడు అట్లీ గనుక.!
నయనతార కూడా ఈ సినిమాలో నటించింది. లేడీ సూపర్ స్టార్ కదా.. అందుకే, నయనతార సినిమాకి తమిళనాట క్రేజ్ అనూహ్యంగా వుంది.
తెలుగు సినిమాలానే ‘జవాన్’ని ట్రీట్ చేస్తుండడం మరో విశేషమిక్కడ.! ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ సినిమా కూడా పాన్ ఇండియా గ్లామర్‌ని అద్దుకుంటోంది.
Jawan FDFS Review.. రేసీ స్క్రీన్ ప్లే.!
హీరో ఇంట్రడక్షన్ సీన్ దగ్గర్నుంచి, రేసీ స్క్రీన్ ప్లే.. ఈ సినిమాకి బలం అనీ, యాక్షన్ ఎపిసోడ్స్ వేరే లెవల్‌లో వున్నాయనీ సినిమా చూసినోళ్ళు అంటున్నారు.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిందట. షారుక్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్, నయనతార తదితరుల పెర్ఫామెన్స్.. దేనికదే ప్రత్యేకం.. అన్నది చాలామంది అభిప్రాయం.

రివ్యూలు కూడా పాజిటివ్‌గానే కనిపిస్తున్నాయ్. వన్ వర్డ్.. బ్లాక్ బస్టర్.. అంటూ ప్రచారమూ జరుగుతోంది.
అయితే, ఈ పాజిటివ్ టాక్ అంతా, ‘పీఆర్ మాయాజాలం’ అని కొట్టి పారేస్తున్నవారూ లేకపోలేదు. ఈ మధ్య ఇలా సూపర్ హిట్ టాక్ వచ్చి, డిజాస్టర్‌గా మిగిలిన చిత్రాలూ లేకపోలేదు. అది వేరే సంగతి.
Also Read: చిరంజీవి: నా తమ్ముడు పవన్ కళ్యాణ్ జన హృదయ సేనాని.!
కాగా, ‘జైలర్’ సినిమాతో రజనీకాంత్, బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపినట్టే, షారుక్ ఖాన్ కూడా ఈ ‘జవాన్’తో సరికొత్త బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టిస్తాడన్న చర్చ అంతటా జరుగుతోంది.
ప్రీ రిలీజ్, ఈ సినిమా కోసం చేసిన పబ్లిసిటీ.. ఇంతకు ముందు ఏ సినిమాకీ జరగనంత ప్లానింగ్‌తో జరిగిందనొచ్చేమో.! అందుకే, అడ్వాన్స్ బుకింగులు హోరెత్తాయ్.! అదే మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణంగా చెప్పొచ్చు.