Table of Contents
Jeevitha Rajasekhar Against Chiranjeevi.. ఆమె సినీ నటి. ఆయన సినీ నటుడు. నటిగా ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. నటుడిగా ఆయనా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించాడు. ఆర్థికంగా ఉన్నత స్థానంలోనే వున్నారు.
కానీ, ఎక్కడో మెగాస్టార్ చిరంజీవి అంటే వ్యక్తిగత వైరం.! జీవిత (Jeevitha), రాజశేఖర్ (Rajasekhar).. పరిచయం అక్కర్లేని పేర్లవి. చిరంజీవి పేరు చెబితేనే చాలు ఒకప్పుడు తొక్కిన తాచులా బుసలు కొట్టేది ఈ సినీ జంట.!
‘రాజశేఖర్ చేయాలనుకున్న సినిమాల్ని చిరంజీవి బలవంతంగా లాక్కున్నారు..’ అంటూ నోరు పారేసుకోవడం దగ్గర్నుంచి, ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో అక్రమాలు జరుగుతున్నాయి..’ అంటూ రాజకీయ విమర్శలు చేసేంతవరకు.. నడిచిన యాగీ అంతా ఇంతా కాదు.!
Jeevitha Rajasekhar Against Chiranjeevi.. కానీ, ఎందుకు.?
‘మెగాస్టార్ చిరంజీవిని అపార్థం చేసుకున్నాం.. రాజకీయంగా విమర్శలు చేయాల్సి వచ్చింది, చేశాం..’ అంటూ ఆ తర్వాత క్షమాపణ చెప్పారు కూడా.

‘చిరంజీవి అభిమానులు మా మీద దాడి చేశారు..’ అంటూ అప్పట్లో ఓ ‘మహా మేత’ కోసం జీవిత, రాజశేఖర్ చేసిన రగడ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఆ ఘటనపై స్పందించిన చిరంజీవి, తనకు దాంతో సంబంధం లేకపయినా.. తనకు చెడ్డ పేరు వస్తుందన్న కోణంలో జీవిత, రాజశేఖర్ దంపతుల వద్దకు వెళ్ళారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తప్పంతా మీడియాదేనా.? హవ్వ.! ఇదేం కామెడీ.?
చెయ్యాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు తమ ‘పైత్యాన్ని’ మీడియా మీద రుద్దేస్తున్నారు జీవిత, రాజశేఖర్. ‘అంతా మీడియానే చేసింది..’ అంటూ కొత్త కథ తెరపైకి తెచ్చారు తాజాగా జీవిత (Jeevitha).
Also Read: చిరంజీవి దేవుడట.! పవన్ కళ్యాణ్ దెయ్యమట.!
రాజశేఖర్ (Rajasekhar) ఏ పార్టీలోనూ చేరలేదట. కానీ, అవసరానికో పార్టీ.. అన్నట్టు, ఆయా పార్టీల తరఫున ప్రచారం చేయడం జీవితకీ, రాజశేఖర్‌కీ కొత్తేమీ కాదు.
సరే, ఒక్కోసారి ఒక్కో రాజకీయ పార్టీకి మద్దతివ్వడం వారి వ్యక్తిగత విషయం.. దాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ, చిరంజీవిని విమర్శించేందుకే రాజకీయం చేయడమే అత్యంత దారుణమైన విషయం.
ఎందుకంటే, చిరంజీవి కౌంటర్ ఎటాక్ ఇవ్వరు కాబ్టటి.!
ఏ చిన్న అవకాశం దొరికినా, చిరంజీవి (Mega Star Chiranjeevi) మీద విమర్శలు ఎందుకు చేస్తారు.? అంటే, చిరంజీవి వైపు నుంచి కౌంటర్ ఎటాక్ జరగదు గనుక.
Also Read: నిహారిక కూడా మీ ‘ఆడకూతురు’ లాంటిదే కదా.!
జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) అయినా, ఇంకొకరైనా.. మెగా కాంపౌండ్ మీద బురద చల్లేందుకోసం వారికి ఓ కారణం అవసరం లేదు.. ఎందుకంటే, అక్కసుతో రగిలిపోతుంటారు గనుక.!