Jr NTR Koratala Siva.. కథ మళ్ళీ మొదటికొచ్చింది.! యంగ్ టైగర్ ఎన్టీయార్ – కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది.? అంటే, ప్చ్.. ఖచ్చితమైన సమాధానం రావట్లేదు.
ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభమన్నది మొన్నామధ్యన వచ్చిన ఓ అప్డేట్ సారాంశం. కానీ, అది కాస్తా వెనక్కి వెళ్ళే అవకాశం వుందట. ఎంత వెనక్కి.? అన్నదానిపై స్పష్టత లేదు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ‘మమ’ అనిపించేయడం కోసం, ఏర్పాట్లు జరుగుతున్నాయట. అంటే, సినిమా షూటింగ్ ప్రారంభించేశామని చెప్పడం కోసం.
Jr NTR Koratala Siva.. పిబ్రవరిలోనే ప్రారంభం.. కానీ..
ఫిబ్రవరిలోనే ‘ఎన్టీయార్ – కొరటాల శివ’ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. కానీ, జస్ట్ రెండు మూడు రోజులేనని తెలుస్తోంది.
సినిమా లైవ్లోనే వుందనిపించడానికే ఈ ప్రయత్నమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి రెండోవారం నుంచి అసలు సిసలు షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట.
అయితే, ఇదంతా అభిమానుల్ని సంతోషపెట్టడానికి చేస్తోన్న ‘పీఆర్’ యాక్టివిటీయేనా.? అన్న అనుమానాలూ లేకపోలేదు.
సమస్య ఎక్కడొస్తోంది.?
అసలు సమస్యంతా కథతోనేనన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. కథ విషయంలో కొరటాల ఓ క్లారిటీకి రాలేకపోతున్నాడట. అంతా ఓకే అనుకున్నా, అనేకానేక డౌట్లు ఆయన్ని వెంటాడుతున్నాయట.
Also Read: Nithya Menen.. టీచరమ్మ పాఠం.. వాళ్ళకి గుణపాఠం.!
ఇదంతా ‘ఆచార్య’ ఎఫెక్టేనన్నది జగమెరిగిన సత్యం. కొరటాల శివ జడ్జిమెంట్ పూర్తిగా దెబ్బ తినేసిన దరిమిలా, తిరిగి ఆ కాన్ఫిడెన్స్ పొందడంలో కొరటాల శివ చాలా ఇబ్బంది పడుతున్నాడట.
ఒక్కటి మాత్రం నిజం.. ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత, ఎన్టీయార్.. అస్సలేమాత్రం తొందరపడకుండా, కొరటాల శివకి తగినంత సమయం ఇవ్వడాన్ని అభినందించాలి.
అదే సమయంలో, ఎట్టి పరిస్థితుల్లోనూ తన సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీయార్ రేంజ్ తగ్గకూడదనే కసితో వున్న కొరటాల శివని అభినందించకుండా ఎలా వుండగలం.?
ఇక, ఈ చిన్న ఆలస్యమంటారా.? ‘కాస్త లేటయినా.. అత్యద్భుతమైన సినిమా రాబోతోంది’ అని ఈ ప్రాజెక్టు గురించి కళ్యాణ్ రామ్ గతంలో చెప్పిన మాటల్ని ఇంకోసారి ప్రస్తావించుకోవాలి మరి.!