Table of Contents
Jr NTR Koratala Siva.. మెగాస్టార్ చిరంజీవిని నిండా ముంచేశాడు.. యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని కూడా నిలువునా పాతరేసేయబోతున్నాడా.?
ఒకప్పుడు దర్శకుడు కొరటాల శివ.. అంటే, అది జస్ట్ పేరు కాదు.. అదొక బ్రాండ్.. అని అంతా అనుకునేవారు. సినిమాకి అన్నీ తానే అయి వ్యవహరించేవాడు దర్శకుడు కొరటాల శివ.
కేవలం దర్శకత్వం మాత్రమే కాదు, తెరవెనుక నిర్మాణ వ్యవహారాలు, మార్కెటింగ్.. ఇలా అన్నీ కొరటాల శివ స్వయంగా చూసుకోవడం వల్ల ఆయా ప్రాజెక్టులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడేది.
Jr NTR Koratala Siva ఆచార్యతో అంతా మారిపోయింది..
కానీ, ‘ఆచార్య’తో అంతా మారిపోయింది. ఒక్క ఫ్లాప్.. కొరటాల శివని పాతాళంలోకి తొక్కేసింది. సినిమా జయాపజయాలు అనేవి హీరో చేతుల్లోనో, దర్శకుడి చేతుల్లోనో, నిర్మాత చేతుల్లోనే వుండదు.
ఒక్కోసారి టైమ్ బ్యాడ్ అంతే. కావాలని ఎవరూ చెత్త సినిమా చేయాలనుకోరు కదా.!
కానీ, బౌన్స్ బ్యాక్ అవడానికి దర్శకుడు కొరటాల చాలా సమయం తీసుకుంటున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో సినిమా ప్రారంభించాల్సి వున్నా.. మీనమేషాల్లెక్కెడుతున్నాడు.
ఇదిగో.. అదిగో.. అంటూ నెలలు గడిచిపోతున్నాయ్. ఫిబ్రవరి నుంచి సినిమా సెట్స్ మీదకి.. అన్నది తాజా ఖబర్.
కథ కొలిక్కి వచ్చిందా.? లేదా.?
అయితే, ఇక్కడా చాలామందికి డౌటానుమానాలున్నాయ్. కథ ఫైనల్ అయ్యిందా.? లేదా.? అంటే, స్పష్టత లేదు. సినిమాపై క్రేజ్ తగ్గకుండా వుండేందుకు.. చిత్ర నిర్మాణ సంస్థ ఏవేవో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వుంది.

‘ఆచార్య’ తర్వాత చిరంజీవి నుంచి రెండు సినిమాలొచ్చేశాయ్.. చిరంజీవి ఇంకోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా నిరూపించుకున్నారు.
మరోపక్క, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ నుంచి ఓ సినిమా వచ్చింది.. అదే ‘ఆచార్య’. ఇంకోటి షూటింగ్ దశలో వుంది. అదే శంకర్ దర్శకత్వంలోని సినిమా.
లాక్ అయిపోయిన ఎన్టీయార్
ఎన్టీయార్ మాత్రం కొరటాల శివ దగ్గర లాక్ అయిపోయాడు. ఏంటీ దుస్థితి.? అని యంగ్ టైగర్ అభిమానులు గుస్సా అవుతున్నారు.
Also Read: ఎన్టీయార్ కౌంటర్ ఎటాక్.! ఇంతలా ‘గడ్డి’ పెట్టేశాడేంటీ.?
కొరటాలదీ ఏమీ చేయలేని పరిస్థితి. తొందరపడితే.. తేడా కొట్టేస్తుంది. అలాగని, ఎక్కువ సమయం తీసుకోవడానికి వీల్లేదు. మరెలా.?
స్ట్రగుల్ కొరటాల శివదే.! కానీ, ఎన్టీయార్ కెరీర్‌తో కొరటాల ఆడేసుకుంటున్నాడన్న ప్రచారమైతే గట్టిగా జరుగుతోంది.