Jr NTR Political Party.. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులు.. అభిమానుల ఆదరణ.. ఇవి వున్నన్నాళ్ళూ తనని ఎవరూ ఆపలేరన్నది జూనియర్ ఎన్టీయార్ చెప్పిన మాట.
‘వార్-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జూనియర్ ఎన్టీయార్, అసందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు, జూనియర్ ఎన్టీయార్‌ని ఎవరైనా ఎందుకు ఆపుతారు.?
పవన్ కళ్యాణ్, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ చేసే వ్యాఖ్యల వెనుక బలమైన కారణం వుంటుంది. ఆయన సినిమాల్ని, ఆయన రాజకీయ ప్రయాణాన్ని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు వైసీపీ చేసింది.
Jr NTR Political Party.. ఊళ్ళో పెళ్ళికి.. వాటి హడావిడేంటి.?
జూనియర్ ఎన్టీయార్ విషయంలో అలా ఏమీ జరగలేదు. సరే, టీడీపీలోని ఓ వర్గం, జూనియర్ ఎన్టీయార్ విషయమై ఒకింత ‘కినుక’ వహిస్తుంటుందన్నది వేరే చర్చ.
ఎప్పుడూ తాతయ్య, బాబాయ్.. అని మాట్లాడే జూనియర్ ఎన్టీయార్, ‘వార్-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాబాయ్ బాలయ్య భజన మర్చిపోవడం, ఒకింత ఆశ్చర్యకరం.

సరే, అది ఆయనిష్టం.. అది వేరే చర్చ. జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తాడన్నది తాజా చర్చ. ‘రాజకీయాల్లోకి రాకుండా తమ హీరోని ఎవరూ ఆపలేరంటున్నారు అతని అభిమానులు.
జూనియర్ ఎన్టీయార్ కాదు.. ఎన్టీయార్.. అంటూ, ఎప్పుడో జూనియర్ ఎన్టీయార్ అభిమానులు, తమ అభిమాన హీరోని కొత్తగా పిలవడమూ మొదలు పెట్టారు.
వాళ్ళకి గిట్టదుగాక గిట్టదు..
‘వార్-2’ సినిమా రిలీజ్ సందర్భంగా వేసిన పోస్టర్లు, కట్టిన ఫ్లెక్సీల్లో అభిమానులు ‘సీఎం ఎన్టీయార్’ అని రాసుకోవడం, టీడీపీలో ఓ వర్గానికి అస్సలు గిట్టడంలేదు.
దీన్ని వైసీపీ అను‘కుల’ మీడియా, వేరే లెవల్‌లో ప్రొజెక్ట్ చేస్తోంది. రాజకీయాల్లోకి రావాలని జూనియర్ ఎన్టీయార్ డిసైడ్ అయ్యాడని కథనాలు పుట్టిస్తోంది.
Also Read: Sarzameen Telugu Review: తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం.!
రాజకీయాల్లోకి వెళ్ళాలని ఒకవేళ జూనియర్ ఎన్టీయార్ అనుకుంటుంటే, అతన్ని ఎవరూ ఆపరు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
అయితే, రాజకీయాల్లోకి వెళ్ళి తాను సాధించేదేంటి.? అన్న ఆత్మ విమర్శ చేసుకుంటే, జూనియర్ ఎన్టీయార్ తనను తానే ఆపేసుకుంటారు. గత కొన్నాళ్ళుగా తనను తానే ఆపేసుకుంటున్నారు మరి.!