JrNTR Fans Targets Maheshbabu.. హీరోల మధ్య ఎంత మంచి స్నేహ సంబంధాలున్నప్పటికీ, ఫ్యాన్స్ మధ్య మాత్రం ఆ తరహా స్నేహాన్ని క్రియేట్ చేయడం ఆ హీరోల వల్ల కాకపోతోంది.
ఏమాత్రం తేడా వచ్చినా సోషల్ మీడియా వేదికగా ఆయా హీరోల ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అలా ఇలా వుండడం లేదంటే అతిశయోక్తి కాదు.
ఈ మధ్య ఈ పైత్యం మరీ ఎక్కువైపోయింది. తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్‌కీ, జూనియర్ ఎన్టీయార్ ఫ్యాన్స్‌కీ మధ్య వార్ డ్యూయల్ సైడ్‌లో దుమ్ము దులిపేస్తోంది.
JrNTR Fans Targets Maheshbabu.. పోస్టర్‌తో ఓ ఆటాడేసుకున్నారంతే..
రీసెంట్‌గా మహేష్ బాబు (Super Star Maheshbabu) కొత్త సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌ని పట్టుకుని ఎన్ని రకాల కామెంట్లు చేయాలో అన్ని రకాలా కామెంట్లు చేస్తున్నారు ఎన్టీయార్ (JrNTR) ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా.
జుగుప్స కలిగించేలా దారుణంగా ట్రోల్స్ వినిపిస్తున్నాయ్ ఈ పోస్టర్ పైన. ఇక పెద్దాయన సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మరో అప్డేట్ ఇచ్చేందుకు SSMB28 టీమ్ సంసిద్ధమవుతోంది.
ప్రతీ ఏడాది కృష్ణ బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చే మహేష్ బాబు (Mahesh Babu) ఈ సారి SSMB28 టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది.

ఇక అంతే.! ఎన్టీయార్ ఫ్యాన్స్ టార్గెట్ చేసేందుకు రెడీ అయిపోయారు. మొన్న ఎన్టీయార్ బర్త్‌డే సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్టీయార్‌ని ట్రోల్ చేస్తూ నెట్టింట రచ్చ చేసిన సంగతి తెలిసిందే.
సోషల్ ‘వార్’కి రె‘ఢీ’.!
అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఎన్టీయార్ ఫ్యాన్స్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ‘సిద్ధంగా వుండండి..’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నారు.
మహేష్ ఫ్యాన్స్ చేయబోయే ట్రోల్ ఫైట్‌కి కౌంటర్ ఎటాక్ ఇచ్చేందుకు ఎన్టీయార్ (JrNTR) ఫ్యాన్స్ కూడా ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారట.
చూస్తుంటే, ఈ సోషల్ ఫైర్ నెక్స్‌ట్ లెవల్‌లో వుండబోతోందనీ అర్ధమవుతోంది.
lso Read: ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ.! తేజకి తెలుసుగానీ, చెప్పడట.!
గతంలో మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ఫంక్షన్‌కి ఎన్టీయార్ ముఖ్య అతిథిగా వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు చేసుకోవాలి మరి.
ఇక ఎన్టీయార్ ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
అలాగే, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్ బాబు (Mahesh). ఈ సినిమాలో పూజా హెగ్ధే (Pooja Hegde), శ్రీలీల (Sree Leela) హీరోయిన్లుగా నటిస్తున్నారు.