Kajal Aggarwal Accident.. సినీ నటి కాజల్ అగర్వాల్ యాక్సిడెంట్‌కి గురైందిట. తీవ్ర గాయాలయ్యాయట. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుందిట.!
ఇంతకీ, యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది.? కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఇప్పుడెలా వుంది.? ఈ ప్రశ్నల చుట్టూ సోషల్ మీడియా వేదికగా అభిమానుల గగ్గోలు.!
ఇంకోపక్క, సినీ పరిశ్రమ నుంచి కాజల్ అగర్వాల్ సన్నిహితులు, ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేయడమూ జరిగిపోయింది.
Kajal Aggarwal Accident..కట్ చేస్తే..
అసలు విషయమేంటంటే, ఇదంతా జస్ట్ ఓ గాసిప్.! పనికిమాలిన రూమర్. ఎవరో టైమ్ పాస్ కోసం సృష్టించిన గాలి వార్త.!
ఈ విషయాన్ని స్వయంగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) సోషల్ మీడియా వేదికగా తేల్చి చెప్పింది. తాను క్షేమంగానే వున్నట్లు ప్రకటించింది.

తాను ఎలాంటి ప్రమాదానికీ గురి కాలేదనీ, కొంతమంది కట్టు కథలు అల్లారనీ కాజల్ అగర్వాత్, సోషల్ మీడియా వేదికగా, వివరణ ఇచ్చింది. దాంతో, అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గాసిప్స్ కొత్తేమీ కాదుగానీ..
సెలబ్రిటీస్ మీద గాసిప్స్ కొత్తేమీ కాదు. లవ్ ఎఫైర్స్, పెళ్ళి.. ఇలాంటి గాసిప్స్ ఓ రకం. చావు గాసిప్స్ ఇంకో రకం. యాక్సిడెంట్స్, చావులు.. ఇలాంటి గాసిప్స్ కూడా సెలబ్రిటీలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
సరదా కోసమో.. సంచలనం కోసమో.. ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేస్తే.. సెలబ్రిటీలు కూడా మనుషులే కదా, వారి కుటుంబాల్లోనివారు ఏమైపోతారు.?
Also Read: బిగ్ క్వశ్చన్.! మీ బిర్యానీలో ‘చికెన్’ వుందా.?
ఆ మాత్రం ఇంగితమే వుంటే.. చావుల మీద, ప్రమాదాల మీద కూడా ఎలా గాసిప్స్ క్రియేట్ చేయగలుగుతారు ఎవరైనా.?
కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికొస్తే, ఇటీవల ‘కన్నప్ప’ సినిమాలో పార్వతీదేవి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు, నందమూరి బాలకృష్ణ సరసన ‘భగవంత్ కేసరి’లో నటించింది.
‘ఇండియా స్టోరీ’, ‘రామాయణ’ తదితర సినిమాల్లో నటిస్తూ బిజీగా వుంది కెరీర్ పరంగా కాజల్ అగర్వాల్.
