Kajal Aggarwal Bhagavanth Kesari.. అందాల చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు నేడు.! ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
‘భగవంత్ కేసరి’ టీమ్, కాజల్ అగర్వాల్‌కి (Kajal Agarwal) పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
Kajal Aggarwal Bhagavanth Kesari.. సైకాలజిస్టుగా కాజల్ అగర్వాల్..
డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తోంది కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) సినిమాలో. కళ్ళద్దాలు పెట్టుకుంది. చీరకట్టులో.. ఫోన్ మాట్లాడుతూ వుంది.
చేతిలో ఓ పుస్తకం.! అది కూడా సైకాలజీకి సంబంధించినది. అంటే, కాజల్ అగర్వాల్‌ని (Kajal Aggarwal) ఈ సినిమాలో సైకాలజిస్టు అనుకోవచ్చేమో.!

అక్కడే వచ్చింది అసలు సమస్య. బాలయ్య మీద విపరీతంగా ట్రోలింగ్ షరూ అయ్యింది. అలా ట్రోలింగ్ చేస్తున్నది కూడా జూనియర్ ఎన్టీయార్ అభిమానులే.
బాబాయ్ వర్సెస్ అబ్బాయ్..
నందమూరి బాలకృష్ణకీ (Nandamuri Balakrishna), జూనియర్ ఎన్టీయార్‌కీ (Jr NTR) మధ్య వైరం ఏమైనా వుందా.? ఏమోగానీ, అభిమానులైతే కొట్టుకు ఛస్తున్నారు.!
Also Read: Adipurush Result: ఎవరు ఎవర్ని మోసం చేశారు..?
‘సరైన పాత్ర ఇచ్చారు కాజల్ అగర్వాల్‌కి. మెంటలోడు బాలయ్యకి ట్రీట్‌మెంట్ ఇచ్చే డాక్టరుగా కాజల్ అగర్వాల్‌ని దర్శకుడు అనిల్ రావిపూడి ఎంచుకున్నాడు..’ అంటూ ఎన్టీయార్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
అసలు కథేంటో తెలియదు.! కానీ, ట్రోల్ చేసేస్తున్నారు జూనియర్ ఎన్టీయార్ (Man Of Masses NTR) అభిమానులు బాలయ్యని.! మరీ ఇంత దారుణమా.?

ఔను, కాదేదీ వివాదానికి అనర్మం.! అబ్బాయ్ – బాబాయ్ అభిమానుల మధ్య ఎక్కడ చెడింది.? ఏమోగానీ, గత కొద్ది రోజులుగా అత్యంత అసభ్యకరమైన రీతిలో వివాదం నడుస్తోంది.
బాలయ్య, జూనియర్ ఎన్టీయార్.. ఇద్దరూ దిగొచ్చి.. అభిమానులకి వార్నింగ్ ఇవ్వాలేమో.! వార్నింగ్ ఇచ్చినా దార్లోకి వస్తారా.? కష్టమే.!