Kajal Aggarwal New Webseries.. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించింది, నటిస్తూనే వుంది అందాల చందమామ కాజల్ అగర్వాల్. ఆ మధ్య ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది.
ఫిమేల్ సెంట్రిక్ మూవీ కూడా మొన్నీమధ్యనే తెలుగులో చేసింది. తాజాగా, ఫిమేల్ సెంట్రిక్ వెబ్ సిరీస్ ఒకటి చేయబోతోందిట కాజల్ అగర్వాల్.
హిందీలో, ‘ఆర్య’ పేరుతో ఓ వెబ్ సిరీస్ వచ్చింది. సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది.
తనకు తెలియకుండానే డ్రగ్స్ మాఫియాలో ఇరుక్కుని, ఆ మాఫియా నుంచి తనను, తన పిల్లల్ని కాపాడుకునే ఓ మహిళ కథ ‘ఆర్య’.!
Kajal Aggarwal New Webseries.. యాక్షన్ అండ్ ఎమోషన్స్..
యాక్షన్, ఎమోషన్స్.. అన్నీ పక్కాగా వర్కవుట్ అయ్యాయి ఆ వెబ్ సిరీస్‌లో. హిందీతోపాటు తెలుగు సహా ఇతర భాషల్లో ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ అందుబాటులో వుంది.
ఆ ‘ఆర్య’ వెబ్ సిరీస్‌నే ఇప్పుడు మళ్ళీ కాజల్ అగర్వాల్‌తో రీమేక్ చేస్తారట. నిజానికి, ‘ఆర్య’ కూడా రీమేక్. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే.!

మళ్ళీ దానికి తెలుగులో రీమేక్ అవసరమా.? అది కూడా, తెలుగులో అందరూ ‘ఆర్య’ చూసేశాక, కాజల్ అగర్వాల్‌తో రీమేక్ చేయాలనుకోవడం ఎంతవరకు సబబు.?
ఈ వార్తలో నిజమెంతోగానీ, కాజల్ అగర్వాల్‌కి బాగానే సూటవుతుంది ‘ఆర్య’ వెబ్ సిరీస్.! కేవలం తెలుగు కోసమే తీయరు కదా.. ఇది ఇతర భాషల్లోనూ విడుదలవుతుంది.
Also Read: సన్ గ్లాసెస్.. సోకులాడి స్వప్న సుందరి..
ఖచ్చితంగా సుస్మితా సేన్‌తో కాజల్ అగర్వాల్‌కి కంపేరిజన్స్ వస్తాయ్. నటిగా సుస్మితా సేన్‌కి చాలా మంచి మార్కులు పడ్డాయి ‘ఆర్య’లో.
నటన పరంగా కాజల్ అగర్వాల్ తక్కువేమీ కాదనుకోండి.. అది వేరే సంగతి.! తెలుగు వెర్షన్ కోసం ఎలాంటి మార్పులు చేస్తారోగానీ, కాజల్‌తో తెరకెక్కిస్తే… సౌండింగ్ అదిరిపోతుందన్నది నిర్వివాదాంశం.
