Kajol Devgn Trial Kiss.. వెబ్ సిరీస్ అంటే, అందులో ఖచ్చితంగా ‘మసాలా’ వుండాల్సిందేనా.?
కుదిరితే స్వలింగ సంపర్కం.. లేదంటే.. ఆ స్థాయిలో సహజ శృంగారం.! వెబ్ సిరీస్ అంటే ఇంతేనా.?
బాలీవుడ్ బ్యూటీ కాజోల్ దేవగన్ నటించిన ‘ట్రయల్’ వెబ్ సిరీస్ ఇటీవల ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
సెక్స్ స్కాండల్‌లో చిక్కుకుని జైలుకెళతాడో వ్యక్తి.! అతని భార్య కథ ఈ ‘ట్రయల్’.!
Kajol Devgn Trial Kiss.. అసలు విషయం పక్కకు వెళ్ళిపోయి..
అసలు కేసు సంగతి పక్కన పెడితే, భర్త జైలుకు వెళ్ళడంతో.. ఆ భార్య, తన కుటుంబ పోషణ కోసం పడే కష్టాలు కాస్త ఎక్కువగా ఈ ‘ట్రయల్’లో ఫోకస్ చేశారు.
ప్యారలల్‌గా భర్త కేసు వ్యవహారం కూడా నడుస్తుంటుంది. భర్త నిర్దోషి అని తెలుస్తుంది. భర్త న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి, న్యాయమూర్తిగా ఎదుగుతాడు.
భార్య, న్యాయవాద వృత్తిలోకి తిరిగి వస్తుంది.. భర్త జైలుకు వెళ్ళడంతో. భర్తని అనుమానిస్తుంది.. భర్తకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది కూడా.!
తమ తండ్రి ఇరుక్కున్న సెక్స్ స్కాండల్ వ్యవహారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసి.. వాటిని మార్ఫింగ్‌గా పిల్లలు తేలుస్తారు.!
జస్ట్ ఓకే..
కొంచెం ఫర్లేదు.. చాలా మేరకు సొద.! ఇదీ ‘ట్రయల్’ వ్యవహారం.! కెరీర్‌లో ‘నో కిస్ పాలసీ’ పెట్టుకుందట కాజోల్ (Kajol Devgn).
ఏమో, ఎక్కడో తెలీదు.! చాలా సినిమాల్లో శృతిమించిన శృంగారం నటిగా కాజోల్ ఒలకబోసిన విషయం విదితమే.
ఇక్కడ ఈ ‘ట్రయల్’ వెబ్ సిరీస్ విషయానికొస్తే, లిప్ లాక్ అనేది అస్సలు అవసరంలేని విషయం. కానీ, స్పేస్ క్రియేట్ చేసి మరీ, లిప్ కిస్ సీన్ పండించేశారు.
దేనికి.? ఎందుకంటే, ఇది వెబ్ సిరీస్ కాబట్టి.! పోనీ, ఆ లిప్ కిస్ వల్ల ఏమన్నా అదనంగా ఒరిగిందా.? అంటే, అదీ లేదు. జస్ట్ కక్కుర్తి అంతే.!
నటిగా కాజోల్ (Kajol Devgn) గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆ పొటెన్షియాలిటీని సరిగ్గా వాడుకోలేకపోయారు.