Kalpika Ganesh.. మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతోంది సినీ నటి సమంత. ఆ కారణంగానే తన తాజా చిత్రం ‘యశోద’ సినిమా ప్రమోషన్లలో సమంత ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయింది.
తన జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితుల్ని ఈ అనారోగ్య సమస్య కారణంగా ఎదుర్కొంటున్నట్లు చెమర్చిన కళ్ళతో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సమంత.
సినీ తారలంటే, ఆకాశం నుంచి ఊడిపడరు. వాళ్ళూ మామూలు మనుషులే. వారికీ అనారోగ్య సమస్యలుంటాయ్.
అయ్యోపాపం సమంత.!
ఆ మాటకొస్తే, సినిమాల్లో నటన కారణంగా.. హెవీ లైటింగ్, ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితుల్నీ తారలు ఎదుర్కోవాల్సి వుంటుంది. కానీ, పైకి మాత్రం చాలా సెన్సిటివ్‌గా కనిపిస్తారు.
దాదాపు వంద కిలోల బరువుని ఎత్తేస్తూ సమంత పలు సందర్భాల్లో వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాంటి సమస్యకి, ఇలాంటి అనారోగ్య సమస్య ఎలా వచ్చిందబ్బా.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఇంతలోనే, మరో సినీ నటి తనకూ అలాంటి అనారోగ్య సమస్య వుందని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు కల్పిక గణేష్. ‘యశోద’ సినిమాలో సమంతతో కలిసి నటించింది కూడా.
Kalpika Ganesh కల్పిక ఎందుకు కెలికిందబ్బా.?
‘ఆ సమస్య ఎంత తీవ్రమైనదో నాకు తెలుసు. నాది ఇంకా ఎర్లీ స్టేజ్. సమంత పరిస్థితి అత్యంత బాధాకరం. ఆమెది మూడో స్టేజ్..’ అంటూ కల్పిక గణేష్ వ్యాఖ్యానించడంతో అంతా ఆశ్చర్యపోయారు.
కల్పిక పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందా.? అనే డౌట్ చాలామందికి వచ్చింది. ఆమె సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడింది కూడా.!
Also Read: ఔను.! వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు.!
ట్రోలింగ్ చేసేవాళ్ళకి కౌంటర్ ఎటాక్ ఇవ్వడం ద్వారా కల్పిక టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యిందనుకోండి.. అది వేరే సంగతి.
‘నాది ఫస్ట్ స్టేజ్.. సమంతది మూడో స్టేజ్..’ అని కల్పిక ప్రకటించాక, సమంత అరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో సందేహాలు మరింతగా పెరిగిపోయాయ్.
ఇంకోపక్క, సమంతతో సినిమాలు చేస్తున్నవారూ డైలమాలో పడిపోతున్నారు. కల్పిక ప్రకటన సమంత పట్ల సింపతీ పెంచడం మాటెలా వున్నా, సమంత కెరీర్‌ని అయోమయంలో పడేసేలా వుంది.