Kalyan Ram Amigos.. నందమూరి కళ్యాణ్ రామ్.. సక్సెస్ అలాగే ఫెయిల్యూర్ అనే లెక్కలేవీ వేసుకోకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంటాడు.
నటుడిగానే కాదు, నిర్మాతగానూ ప్రయోగాలు చేయడం కళ్యాణ్ రామ్ ప్రత్యేకత. ఈ విషయంలో కళ్యాణ్ రామ్‌ని అభినందించి తీరాల్సిందే.
మొన్నీమధ్యనే ‘బింబిసార’ అనే సినిమాతో హిట్టుకొట్టిన కళ్యాణ్ రామ్, ఈసారి ‘అమిగోస్’ అంటున్నాడు. ‘బింబిసార’ సినిమాలో ద్విపాత్రాభినయం.. ‘అమిగోస్’ సినిమాలో మాత్రం త్రిపాత్రాభినయం.!
Kalyan Ram Amigos.. ఏంటీ అమిగోస్.!
‘అమిగోస్’ సంగతేమోగానీ.. అందులోని డాపల్‌గేంగర్స్ అనే అంశం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఒకేలా కనిపించే ముగ్గురు వ్యక్తులు.! ఇదీ ‘అమిగోస్’ తాజా పోస్టర్ సారాంశం.
పైన చూస్తున్నారు కదా.. మూడు గెటప్స్‌లో కనిపిస్తున్నదీ కళ్యాణ్ రామ్ మాత్రమే.! ఒక్కో పాత్రకీ ఒక్కో పేరు కూడా పెట్టారు. గెటప్స్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా వున్నాయి కదా.!
Also Read: Vijay Varasudu.. అన్నీ కలిపి కొట్టేశాడు.!
రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆషిక రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
త్రిపాత్రాభినయాలు కొత్తేమీ కాదుగానీ..
మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం క్రితమే ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమా చేశారు. యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘జై లవ కుశ’ సినిమా కోసం త్రిపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే.
ఎన్ని పాత్రల్లో కనిపించామన్నది ముఖ్యం కాదు.. ఆయా పాత్రల్లో ఎంత విభిన్నంగా నటించామన్నదే ముఖ్యం. మరి, కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం ఏమవుతుంది.? వేచి చూడాల్సిందే.