Kalyani Priyadarshan Kotha Lokah.. తల్లి నటి కాబట్టి.. తండ్రి ఫిలిం మేకర్ కాబట్టి.. సినీ రంగంలోకి ఆమె తేలిగ్గా ఎంట్రీ ఇచ్చేయగలిగిందని ఎవరైనా అనుకుంటే పొరపాటే.!
ఎవరామె.? ఇంకెవరు, అక్కినేని అఖిల్ సరసన ‘హలో’ సినిమాతో తెరంగేట్రం చేసిన కళ్యాణి ప్రియదర్శన్.
తెలుగులోనే శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘రణరంగం’ సినిమాలోనూ, సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘చిత్రలహరి’ చిత్రంలోనూ కళ్యాణి ప్రియదర్శన్ నటించింది.
Kalyani Priyadarshan Kotha Lokah.. తెలుగులో హిట్టు దొరక్క..
అయితే, తెలుగులో సరైన హిట్టు మాత్రం కళ్యాణి ప్రియదర్శన్‌ని వరించలేదు. అడపా దడపా మలయాళ సినిమాలు చేస్తూ వచ్చింది.

చాన్నాళ్ళ తర్వాత, ‘కొత్త లోక’ అంటూ, తాజాగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది కళ్యాణి ప్రియదర్శన్. తొలుత ఈ ట్రైల్ చూసి, పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
కానీ, సినిమా రిలీజ్ అయ్యాక.. సీన్ మారిపోయింది. కళ్యాణి ప్రియదర్శన్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాకి వసూళ్ళు పెరుగుతున్నాయి.
మౌత్ టాక్‌తోనే మజా..
పెద్దగా పబ్లిసిటీ లేకుండానే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కొత్త లోక’ సినిమాకి దాదాపుగా విడుదలైన ప్రతి చోట నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరీ ముఖ్యంగా, కళ్యాణి ప్రియదర్శన్ నటనకు ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు. ఇంత టాలెంట్‌ని ఇన్నాళ్ళూ ఎలా మిస్సయ్యాం.. అన్నది సినిమా చూసినవాళ్ళ అభిప్రాయం.
Also Read: మండల మర్డర్స్ రివ్యూ: న్యూక్లియర్ సైంటిస్టు.. మూఢ నమ్మకాలూ.!
ముందే చెప్పుకున్నట్లు తల్లి నటి అయినా, తండ్రి ఫిలింమేకర్ అయినా.. కళ్యాణి నటిగా నిలదొక్కుకున్నది మాత్రం తన ఓన్ టాలెంట్‌తోనే.
నటనా రంగంలోకి రావాలనుకున్నప్పుడే, సినిమా మీద సంపూర్ణ అవగాహన కోసం దర్శకత్వ విబాగంలో పనిచేసింది. నటనలోనూ శిక్షణ తీసుకుంది కళ్యాణి ప్రియదర్శన్.